Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంతర్జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవం... అసలు మెంటల్ స్థితి ఎలా ఉంటుందో తెలుసా...?

అంతర్జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవం... అసలు మెంటల్ స్థితి ఎలా ఉంటుందో తెలుసా...?
, శనివారం, 10 అక్టోబరు 2015 (16:32 IST)
మనిషి పుట్టాక ఎలాంటి వైకల్యం లేకుండా ఉంటే అతడి జీవితం హ్యాపీగా సాగుతుంది. ఐతే చిన్న వైకల్యం ఉన్నా అది జీవితాంతం అతడిని పీడిస్తుంది. ఐతే కొందరు పుట్టుకతో ఆరోగ్యకరంగా బాగానే ఉన్నప్పటికీ హఠాత్తుగా మానిసిక రోగులుగా మారిపోతుంటారు. ఇలా ఎందుకు జరిగిందన్నది అర్థంకాదు. కానీ జాగ్రత్తగా పరిశీలన చేస్తే వారికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఈ దిగువ ఐదు అంశాలను అధిగమిస్తే మానసిక వైకల్య సమస్యను అధిగమించవచ్చు. 
 
పబ్లిక్ వైద్య కేంద్రాల్లో మానసిక వైకల్యానికి సంబంధించి నిధులు లేకపోవడం.
మానసిక వైకల్య సమస్యలపై నిశితమైన పరిశీలన లేకపోవడం.
ప్రాధమిక దశలోనే సమస్యను గమనించి తగిన వైద్య చికిత్స అందించకపోవడం.
మానసిక వైకల్య బాధితులకు చికిత్స చేసేందుకు తగు వైద్యులు లేకపోవడం.
ప్రభుత్వరంగ వైద్యశాలల్లో సైతం ఈ సమస్యను నయం చేసేందుకు సరైన వైద్యులు లేకపోవడం.
 
ఇకపోతే అసలు ఈ మానసిక వైకల్యం ఎవరికి వస్తుంది... ఏ దశలో ప్రారంభమవుతుందనే దానిపై చూస్తే... మానసిక వైకల్యం వచ్చిన వారిలో సగానికి పైగా 14 ఏళ్ల లోపు వయసు నుంచి ఈ సమస్య ప్రారంభమవుతుంది. మొత్తం 20 శాతం మంది బాలబాలికల్లో ఈ అవలక్షణం ఉన్నట్లు తేలింది. భయంకర సంఘటనలు, సామాజిక పరిస్థితుల కారణంగా మానసిక వైకల్యం చెందడం సర్వసాధారణమైన కారణంగా చెపుతారు. మానసిక సమస్యతో బాధపడేవారిని గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం, గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా వెంటాడుతాయి. మానసికంగా బలహీనంగా ఉన్నవారు పూర్తిగా ఆ సమస్యలో కూరుకుపోవడానికి కారణం సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా కారణమవుతున్నారు.
 
సమాజంలో ఈ క్రింది లక్షణాలతో కనిపించేవారు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లే అనుకోవాలి. 
సంఘానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం.... కొంతమంది వ్యక్తులు ప్రత్యేకించి కొన్నిసార్లు విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తిస్తూ అరుస్తూ పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. వీరి ప్రవర్తన ఇతరులకు హాని కలిగించేదిగా ఉంటుంది.
 
అమ్నోసియా... ఇది కూడా సర్వసాధారణంగా కనబడేదే. వీరిలో కనిపించే లక్షణం మర్చిపోవడం. బ్రెయిన్ డ్యామేజ్ కారణంగా చెప్పినవి, జరిగినవి మర్చిపోతుంటారు. ఇలాంటివారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
 
ఆస్పర్జెర్స్ సిండ్రోమ్.... వీరిని కూపస్తమంఢూకాలని చెప్పవచ్చు. సమాజంలో ఎవ్వరితోనూ వీరికి సంబంధాలు ఉండవు. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతుంటారు. ఎవరితోనూ మాట్లాడేందుకు ఇష్టపడరు. ప్రత్యేకమైన వ్యక్తులుగా అగుపిస్తుంటారు. ప్రస్తుత సమాజంలో ఇలాంటి వ్యక్తులను మనం అక్కడక్కడా చూస్తుంటాం. 
 
మహా వత్తిడి... ఈ వత్తిడి అనేది చాలా పెద్దపదం. దీని కారణంగా చాలామంది ప్రాణాలు తీసుకున్న సంఘటనలున్నాయి. ఈ ఒత్తిడి సమస్య కారణంగా వారిపై వారికి నమ్మకం సన్నగిల్లుతుంది. సంతోషకరమైన పండుగలు ఇతరత్రా ఏవి వచ్చినా వాటిని జరుపుకునేందుకు ఆసక్తి చూపరు. ప్రతిదాన్ని విమర్శిస్తూ తిట్టుకుంటూ ఉంటారు. నలుగురితో కలిసి తిరగడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. ఇలాంటి వారి మానసిక స్థితిని మామూలు స్థితికి తీసుకురాకపోతే ఆత్మహత్యలకు పాల్పడేందుకు అవకాశం ఉంటుంది. 
 
ఓసీడీ... లేదంటే ఒబెసివ్ కంపల్సివ్ డిజార్డర్... అంటే వీరు ఒకరకంగా మతిమరుపు టైపే. పెట్టినచోట వస్తువు ఉందో లేదో అని పదేపదే చెక్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ప్రతి చిన్నదానికి చేతులు కడుక్కోవడం, ఇంట్లో ఉన్న వస్తువులను లెక్కబెట్టడం, అకస్మాత్తుగా స్నానం చేయడం, తలుపులు వేసి ఉన్నాయో లేదో అని పలుమార్లు చెక్  చేసుకోవడం వంటివి చేస్తుంటారు. అలాగే వదిలేస్తే ఇవి కూడా ఆ వ్యక్తిలో ఆత్మహత్యల వైపు తీసుకెళతాయి. 
 
కాబట్టి మానసిక వైకల్యం ఉన్నవారి విషయంలో కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవల్సిన అవసరం ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu