Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేసవిలో ఫుడ్ పాయిజనింగ్ నుంచి తప్పించుకోవాలంటే?

వేసవిలో అధిక వేడితో ఆహార పదార్థాలు సులభంగా చెడిపోతుంటాయి. అందుకే అప్పుడప్పుడు వండుకుని తినడం వేసవిలో ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Advertiesment
వేసవిలో ఫుడ్ పాయిజనింగ్ నుంచి తప్పించుకోవాలంటే?
, బుధవారం, 3 మే 2017 (15:49 IST)
వేసవిలో అధిక వేడితో ఆహార పదార్థాలు సులభంగా చెడిపోతుంటాయి. అందుకే అప్పుడప్పుడు వండుకుని తినడం వేసవిలో ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆహారం చెడిపోవడానికి వేసవిలో బ్యాక్టీరియాలు సులభంగా వ్యాపించడమే కారణం. అందుకే ఆహారం విషయంలో జాగ్రత్తపడాలని వారు సూచిస్తున్నారు. కాబట్టి వేసవి ఫుడ్ పాయిజనింగ్ నుంచి తప్పించుకోవాలంటే.. ఇంట్లో ఫ్రిజ్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి.
 
లేకుంటే ఫ్రిజ్‌లో ఉండే కూరగాయలు, ఆహార పదార్థాల్లో క్రిములు వ్యాపించడం ద్వారా ఫుడ్ పాయిజన్ సమస్య ఏర్పడుతుంది. ఫ్రిజ్‌లో వుంచిన పదార్థాలను తినేందుకు ముందు కూరగాయలు, పండ్లు మంచి నీటిలో బాగా కడిగి ఉపయోగించాలి. అప్పుడే వాటిపై ఉండే క్రిములు దూరమవుతాయి. వంటింట్లో ఉపయోగించే దుస్తుల్ని రోజూ ఉతకాలి. చికెన్, మటన్ వంటి మాంసాహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచేటప్పుడు కవర్లో ఉంచి లోపల పెట్టాలి. 
 
అలాగే పాత్రల్లో ఉంచితే మాత్రం క్రిములు ఇతర ఆహార పదార్థాలను సైతం చేరుతాయి. మాంసాహారంతో పాటు ఇతర కూరగాయలను కలిపి ఫ్రిజ్‌లో ఉంచకూడదు. మాంసాహారాన్ని, కూరగాయలను కట్ చేసే కత్తులు, బోర్డులు వేర్వేరుగా ఉండాలి. మాంసాహారాన్ని బాగా శుభ్రం చేశాకే వండుకోవాలి. ఇలా చేస్తే ఫుడ్ పాయిజనింగ్ నుంచి తప్పుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవయవ్వనంగా ఉండాలంటే...