బకెట్ నీళ్లలో కొద్దిగా జాజినూనెను కలిపి బాలింతలు స్నానం చేస్తే చక్కగా నిద్రపడుతుంది. మనసుకు హాయిగా ఉంటుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది. అలానే నెలసరి సమయంలో కడుపు నొప్పి అనిపిస్తే పొత్తి కడుపు మీద జాజినూనె రాస్తే మంచిది.
చెంచా పాలమీగడలో నాలుగు చుక్కలు, జాజినూనె కలిపి మర్దన చేస్తే ముఖం మీద మచ్చలు తగ్గుముఖం పడతాయి. ఇంకా మానసిక ఒత్తిడి, ఆందోళనలో ఉన్నవారు జాజినూనెను వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఒంటి నొప్పులతో బాధపడేవారు కొబ్బరి నూనెతో కలిపి రాసుకుంటే నొప్పులు తగ్గిపోతాయి.
కప్పు నీళ్లలో ఆరుచుక్కల నీలగిరి నూనెను కలిపి పుక్కిలిస్తే నోటిపూత, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల నుండి విముక్తి కలుగుతుంది. జ్వరంతో బాధపడేవారికి చల్లటి నీళ్లలో ఆరు నుంచి పది చుక్కల నీలగరితైలం వేసి ఒంటికి పూస్తే జ్వరం త్వరగా తగ్గుతుంది.
జలుబు, దగ్గు, సైనస్ వల్ల వచ్చే తలనొప్పి బాధిస్తుంటే చేతి రుమాలులో నాలుగు చుక్కలు లేసి పీల్చితే ఉపశమనం లభిస్తుంది. చిన్నపిల్లలకు కఫం పెరిగి గురక పెడుతుంటే ఆరు నుంచి పది చుక్కలు నీళ్లలో వేసి పీల్చేలా చూడాలి.