Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వంటల్లో ఏ నూనె బెస్ట్..? గది ఉష్ణోగ్రత వద్ద గడ్డ కడుతోందా...?

మార్కెట్లో రకరకాల నూనెలు ఉంటాయి. వాటిలో ఏది వాడాలన్న దానిపై మనకు ఎప్పటికీ డైలమానే. ఆరోగ్యాన్ని కాపాడటంలో ఏ నూనె ఎంతవరకు వాడవచ్చో నిపుణులు అందిస్తున్న సూచనలు.. గది ఉష్ణోగ్రత వద్ద గడ్డకడుతున్నదంటే అది ఆరోగ్యకరమైనది కాదని అర్థం. అందుకే వనస్పతి, పామాయి

వంటల్లో ఏ నూనె బెస్ట్..? గది ఉష్ణోగ్రత వద్ద గడ్డ కడుతోందా...?
, బుధవారం, 27 ఏప్రియల్ 2016 (13:48 IST)
మార్కెట్లో రకరకాల నూనెలు ఉంటాయి. వాటిలో ఏది వాడాలన్న దానిపై మనకు ఎప్పటికీ డైలమానే. ఆరోగ్యాన్ని కాపాడటంలో ఏ నూనె ఎంతవరకు వాడవచ్చో నిపుణులు అందిస్తున్న సూచనలు.. గది ఉష్ణోగ్రత వద్ద గడ్డకడుతున్నదంటే అది ఆరోగ్యకరమైనది కాదని అర్థం. అందుకే వనస్పతి, పామాయిల్‌లను వాడకూడదు.
 
కొబ్బరినూనెను కేరళలో విరివిగా వాడుతారు. దీనిలో కూడా సాచురేటెడ్ ఫాట్ ఉంటుంది. కానీ కొబ్బరినూనె మంచి కొలెస్ట్రాల్ మోతాదును పెంచుతుంది. కానీ సాధారణంగా కేరళ తప్ప ఎక్కడా దీన్ని అంతగా వాడటం లేదు. సాచురేటెడ్ ఫాట్ బదులు అన్‌సాచురేటెడ్ ఫాట్ తీసుకోవడం వల్ల గుండెజబ్బులకు దూరంగా ఉండొచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
 
ఆలివ్ నూనె, మొక్కజొన్న, సన్‌ఫ్లవర్, సాఫ్లవర్, ఆవాలు, పత్తి, వేరుశనగ నూనెలు వంటలో వాడటానికి అనుకూలమైనవి. ఒమేగా 3, ఆల్ఫా లీనోలిక్ ఆమ్లం (ఎఎల్ఎ) ఎక్కువగా ఉన్న నూనెలు మరింత ఆరోగ్యకరమైనవి. సోయాబీన్, ఆవాల నూనెల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. సోయాబీన్, మస్టర్డ్ నూనెలు అన్నింటికన్నా ఆరోగ్యకరమైనవి. ఎక్కువ వేపుడు చేసినా వీటివల్ల అంతగా హాని జరుగదు. కానీ మనం సాధారణంగా ఎఎల్ఎ విలువ చాలా తక్కువగా ఉండే సన్‌ఫ్లవర్ ఆయిల్‌నే ఎక్కువగా వాడుతున్నాం.
 
వీటి తరువాత వేరుశనగ, మొక్కజొన్న, ఆలివ్ నూనెలు మంచివి. నెయ్యి చాలా తక్కువ మోతాదులో వాడాలి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే నూనెలను విడివిడిగా కంటే అన్నింటినీ కలిపి వాడితే మరింత మేలు చేస్తాయి. ఒకసారి వాడిన నూనెను మళ్లీమళ్లీ వాడటం క్షేమం కాదు. అందుకే బండిపై అమ్మే బజ్జీలు, పకోడీలను తినకపోవడమే మంచిది. సాధ్యమైనంత వరకు ఇంట్లో చేసుకుని తినడం మేలు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాస్య యోగా... అంటే ఏమిటి...? ఏ చేయాలి...?