Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చక్కెర వ్యాధికి చెక్ పెట్టే చిలగడదుంప...

చిలగడ దుపం.. ఈ దుంపలను ఒక్కో ప్రదేశంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. వీటికి కందగడ్డ, స్వీట్ పొటాటో అనేవి కామన్ పేర్లు ఉన్నాయి. పిండి పదార్థాలు, చక్కెర శాతాలను పుష్కలంగా కలిగివుండే ఈ ఆహార పదార్థం మంచి రుచిన

Advertiesment
చక్కెర వ్యాధికి చెక్ పెట్టే చిలగడదుంప...
, మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (08:51 IST)
చిలగడదుపం.. ఈ దుంపలను ఒక్కో ప్రదేశంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. వీటికి కందగడ్డ, స్వీట్ పొటాటో అనేవి కామన్ పేర్లు ఉన్నాయి. పిండి పదార్థాలు, చక్కెర శాతాలను పుష్కలంగా కలిగివుండే ఈ ఆహార పదార్థం మంచి రుచిని కూడా కలిగి ఉంటుంది. చిలగడదుంపను తినటానికి ఇష్టపడని వారు ఉండరు. 
 
ఇందులో ఉన్నన్ని అద్భుతమైన పోషకాలు ఇంకెందులోనూ ఉండవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చిలగడదుంపలో శరీరానికి కావల్సిన పోషకపదార్థాలను అందించడంలోనే కాదు, వివిధ రకాలుగా శరీరంలో చేరిన విషపదార్థాలను తొలగించడంలో చిలగడదుంపలకు ప్రత్యేక స్థానం ఉంది. 
 
ఎదిగే పిల్లలకు స్వీట్‌ పొటాటోను ఉడికించి తినిపించడం వల్ల శరీరంలో ఉన్న విషరసాయనాలు సులభంగా బయటకు పంపిస్తుంది. అనేక ఖనిజ లవణాలతో పాటు దుంపలలో పిండి పదార్థాలు(కార్బోహైడ్రేటులు), విటమిన్‌లు(బి,సి,ఇ) ఉన్నాయి.
 
బంగాళాదుంప, కందగడ్డల్లో కన్నా చిలగడదుంపల్లో పీచు మోతాదు ఎక్కువగా ఉంటుంది. దీంతో నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువసేపు కేలరీలు విడులయ్యేలా చేస్తాయి. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ రక్తంలోని షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. ఒంట్లో ఎక్కువగా ఉన్న ఉప్పును తొలగించి, నీటి మోతాదును నియంత్రిస్తూ అధిక రక్తపోటును తగ్గించటంలో పొటాషియం కీలకపాత్ర పోషిస్తుంది. చిలగడదుంపల్లో పొటాషియం మోతాదూ అధికంగానే ఉంటుంది.
 
పిండి పదార్థాల జీవక్రియల్లో చాలా కీలమైన మాంగనీసు కూడా వీటిల్లో అధికం. అందువల్ల ఇవి రక్తంలో గ్లూకోజు మోతాదులు సాధారణ స్థాయిలో ఉండేలా తోడ్పడతాయి. మ్యాంగనీస్ ఎముకల బలానికి బాగా సహాయపడుతుంది. విటమిన్‌ 'ఇ' మన చర్మం ఆరోగ్యంగా, నిగనిగలాడేందుకు తోడ్పడుతుంది. వయస్సు మీద పడనియ్యకుండా చేసి, ముడతలను అడ్డుకుంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐబ్రోస్‌ థ్రెడ్డింగ్‌ తర్వాత పింపుల్స్ వస్తే...