Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నవ్వు... మానసిక రోగాలకు ఓ సంజీవని.. ఎన్ని ప్రయోజనాలో?

నవ్వు ఒక భోగం... నవ్వించడం యోగం... నవ్వలేకపోవడం రోగం అన్నారు.. నవ్వు గురించి తెలిసిన మహానుభావులు.. నవ్వు ఓ మనిషి తనకు తాను తయారుచేసుకునే అద్భుత సౌందర్య సాధనం. నవ్వుకు మరే ఇతర సౌందర్య సాధనమూ సాటి రాలేద

నవ్వు... మానసిక రోగాలకు ఓ సంజీవని.. ఎన్ని ప్రయోజనాలో?
, సోమవారం, 8 మే 2017 (14:50 IST)
నవ్వు ఒక భోగం... నవ్వించడం ఓ యోగం... నవ్వలేకపోవడం రోగం అన్నారు.. నవ్వు గురించి తెలిసిన మహానుభావులు. నవ్వు ఓ మనిషి తనకు తాను తయారుచేసుకునే అద్భుత సౌందర్య సాధనం. నవ్వుకు మరే ఇతర సౌందర్య సాధనమూ సాటి రాలేదు. 
 
అంతేనా, నిత్యయవ్వనులుగా కనపడాలనుకుంటే చిరునవ్వుతో సమాధానం చెప్పాలని మానసిక వైద్యులు. మనం నవ్వే నవ్వు మన వయసును కప్పి పుచ్చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. నవ్వడం వలన శరీరంలోని ప్రతి భాగానికి వ్యాయామం చేసినంత ఫలితం ఉంటుందట. అలాంటి నవ్వుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిస్తే.. 
 
నవ్వు ఒక ఆధ్యాత్మిక సద్గుణం, మానసిక రోగాలకు సంజీవని. ఒక్కసారి గట్టిగా నవ్వితే శరీరంలోని 108 కండరాలకు శక్తి వస్తుంది. నవ్వుతూ జీవించడం ఒక కళ. మానసికోల్లాసానికి, శారీరక దారుఢ్యానికి నవ్వు ఒక దివ్వ ఔషధం.
 
గట్టిగా నవ్వే వారిలో బీపీని అదుపులో ఉంటుంది. హైబీపీ, ఉబ్బసం, మధుమేహం, మానసిక ఒత్తిడులను నవ్వు అదుపులో ఉంచుతుంది. బాగా నవ్వే సమయంలో శరీరం ఆక్సీజన్‌ను బాగా తీసుకుంటుంది. దీనివల్ల ఎలాంటి హృద్రోగాలు రావు. నవ్వడం వల్ల శరీరంలో నొప్పుల నివారణకు ఉపయోగపడే ఎండార్ఫిస్‌ను శరీరం విడుదల చేస్తుంది.
 
నవ్వు గుండెపోటును నివారిస్తుంది. థైరాయిడ్‌, స్కాండిలైటిస్‌ వంటి సమస్యలను దరిచేరనీయదు. హాయిగా నవ్వే వారికి నరాల బలహీనతలు కూడా దరిచేరవు. ముఖంపై వార్థక్యపు ఛాయలు, ముడుతలు పడనీయకుండా చిరునవ్వు ముఖాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. కంటికి, పెదవులకు, బుగ్గలకు నవ్వు ఒక వ్యాయామం వంటిది. 
 
నవ్వడం వల్ల మెడకు మంచి వ్యాయామం లభిస్తుంది. నరాల బలహీనత పోయి గట్టి పడతాయి. మెడకు బెల్టు వాడే అవసరమే రాదు.
 
బాగా నవ్వుతున్నప్పుడు శ్వాస ఎక్కువ సార్లు పీల్చుకొని వదలడం వల్ల శరీరంలోని అనేక మలినాలు కార్బన్‌డయాక్సైడ్‌ ద్వారా వెళ్లిపోయి, ఛాతీకి సంబంధించిన అనేక వ్యాధులు దూరమవుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ ఆరోగ్యానికి నిఖార్సయిన హామీ కాపర్ బాటిల్స్: రాశీ ఖన్నా