Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేసవిలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు..

Advertiesment
Summer
, శుక్రవారం, 15 ఏప్రియల్ 2016 (16:54 IST)
వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఎన్నో రకాలు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎండ వేడిమికి డీలా పడిపోవాల్సిందే. వేసవి ముగిసేవరకూ ప్రతి ఒక్కరూ, ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాల్సిందే! ఇది తప్పదు. ఉదయం లేచిన దగ్గర్నుండి రాత్రి పడుకునే వరకు, తీసుకునే ఆహారంలో, త్రాగే నీటిలో, ధరించే దుస్తులలో ఇక బయటకు వెళ్లినపుడు తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పదు. మనిషి తినకా తప్పదు, తిరగకా తప్పదు కాబట్టి ఈ రెంటిలో వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పదు.
 
వేసవిలో తాపం తగ్గడానికి అందరూ, ఎక్కువగా నీటినే త్రాగుతుంటారు. ఒక్క నీరే సరిపోదు. రకరకాల ద్రవపదార్థాలు, పానీయాలు తయారు చేసుకుని సేవిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఐస్‌ క్రీములు, కోలా పానీయాలు, రసాయనపూరితాలు, అయినా అందరి దృష్టి ఎక్కువ వీటిపైనే వుంటుంది. స్లో పాయిజన్‌ లాంటి ఈ తరహా పదార్థాలు పానీయాలు, ఎక్కువగా తీసుకుంటే కోరి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. కాలుష్యం లేని స్వచ్ఛమైన నీటిని ఎప్పుడూ దగ్గర వుంచుకోవాలి. ఆకలి తగ్గించుకోడానికి ఏది పడితే అది తినకూడదు. ఫాస్ట్‌ ఫుడ్‌, ఫ్రైస్‌ (వేపుళ్లు) అస్సలు దగ్గరకు రానివ్వకూడదు.
 
వేసవి తాపానికి విరుగుడుగా, ఆరోగ్యాన్నిచ్చే వివిధరకాల పండ్ల రసాలు పానీయాలు చాలా తేలిక పద్ధతులలో తయారుచేసుకోవచ్చు. ఉదాహరణకు, పుదీనా, కొత్తిమీర రసాలు, పుచ్చకాయ, అల్లపురసం పానీయం, దానిమ్మ, ద్రాక్ష రసాలు, జ్యూస్‌లు, ఐస్‌ క్రీములు వంటివి కూడా ఇళ్ళలోనే తయారు చేసుకుని సేవించాలి. 
 
వేసవిలో దుస్తులు ధరించడం కూడా ప్రత్యేకంగా ఉండాలి. నూలు దుస్తులు వాడటం సరైంది. ఏ వయసువారైనా సరే, నూలు దుస్తులు వాడితే, వేసవి తాపం చాలా శాతం తగ్గిపోతుంది. పిల్లలకైతే నూలు దుస్తులు వేయడం తప్పదు కాక తప్పదు. ముదురురంగు, మందపాటి వస్త్రాలు, దుస్తులు దూరంగా వుంచడం మేలు. అలాగే పాలిస్టర్‌, సింథటిక్‌ అసలు వాడకూడదు. లేత రంగులవి, తెల్లని కాటన్‌ దుస్తులే వేసవికి సరిగ్గా సరిపోతాయి. 
 
పది కప్పుల పుచ్చకాయ గుజ్జు, కప్పు చెక్కు తీసిన అల్లం ముక్కలు మిక్సీలో లేదా జ్యూస్‌ ఎక్స్‌ట్రాక్టర్‌లో వేసి రసం తీయాలి. చల్లదనం కోసం కొన్ని నిమిషాలు ఫ్రిజ్‌లో వుంచి త్రాగాలి. ఈ రసం వల్ల, జీర్ణక్రియ ఉత్తేజం అవతుంది. రక్తవృద్ధితో, హెమోగ్లోబిన్‌ పెరుగుతుంది. కిడ్నీ, గుండెలకు మంచిది, తగిన నీటి శాతాన్ని కల్పిస్తుంది. అల్లం రసం వల్ల జీర్ణక్రియ సజావుగా ఉంటుంది. శ్వాససంబంధసమస్యలు దరిచేరవు. 
 
దానిమ్మ గింజలు కప్పు, రెండు కప్పులు ద్రాక్షలో చెంచా పంచదార మొత్తం మిక్స్‌ చేసి ఆ రసాన్ని వడకట్టి ఫ్రిజ్‌లో కొన్ని నిమిషాలు వుంచి సేవించాలి. దానిమ్మ వల్ల అతిసారం, డయేరియా, ప్రేవులలో ఉన్న నులిపురుగులు పోతాయి. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కిడ్నీ, లివర్‌లు ఆరోగ్యంగా ఉంటాయి. హెమోగ్లోబిన్‌ పెరుగుతుంది. గుండె జబ్బుల నివారణకు బాగా పనిచేస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu