Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేసవిలో పిల్లలకు బత్తాయి, ఆపిల్ జ్యూస్‌లు బెస్ట్.. ఫ్లెయిన్ ఫిల్టర్ వాటర్ తాగించండి..

వేసవి కాలంలో పిల్లలకు పుచ్చకాయ, మామిడి, ఆపిల్ జ్యూస్‌లు ఇవ్వడం మంచిది. వీలైనంత వరకు ప్యాకేజ్డ్ డ్రింక్ పిల్లలకు అలవాటు చేయొద్దు. సహజ పదార్థాల నుంచి తీసిన పానీయాలను తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అం

వేసవిలో పిల్లలకు బత్తాయి, ఆపిల్ జ్యూస్‌లు బెస్ట్.. ఫ్లెయిన్ ఫిల్టర్ వాటర్ తాగించండి..
, శనివారం, 4 మార్చి 2017 (13:27 IST)
వేసవి కాలంలో పిల్లలకు పుచ్చకాయ, మామిడి, ఆపిల్ జ్యూస్‌లు ఇవ్వడం మంచిది. వీలైనంత వరకు ప్యాకేజ్డ్ డ్రింక్ పిల్లలకు అలవాటు చేయొద్దు. సహజ పదార్థాల నుంచి తీసిన పానీయాలను తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొందరు పిల్లలు బాదంపప్పు, జీడిపప్పు వంటి గింజల్ని తినడానికి ఇష్టపడరు. ఇలాంటి వారికి ఆల్మండ్‌ మిల్క్‌ బెస్ట్. ఇందులో ప్రొటీన్లు, న్యూట్రిన్లు అధికమని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 
 
తక్కువ కొవ్వులు కలిగిన పీచుపదార్థం కూడా అందుతుంది. ఎవరైతే పాలు తక్కువగా తాగుతారో వారికి లాక్టోజ్ లోపం తలెత్తుంది. పాలు తాగడానికి ఇష్టపడని పిల్లలు సోయామిల్క్‌ తాగించాలి. పిల్లలకు ఉదర ప్రశాంతత కావాలంటే పల్చటి మజ్జిగ తాగించాలి.
 
కడుపులో ఎసిడిటీ తగ్గడంతో పాటు జీర్ణప్రక్రియ సుఖవంతంగా సాగుతుంది. అప్పుడప్పుడు లస్సీ కూడా తాగొచ్చు. ఇందులో పోషకవిలువలు ఎక్కువ. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్లెయిన్‌ ఫిల్టర్‌ వాటర్‌ తాగే విధంగా పిల్లలకు అలవాటు చేయాలి. నీటిలో ఎటువంటి క్యాలరీలు, ఎటువంటి హానికారక రసాయనాలు ఉండవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాత్రిపూట లేటుగా నిద్రపోవద్దు.. యాక్టివ్‌గా ఉండాలంటే ఇలా చేయండి..