Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏసీలొద్దు బాబోయ్.. బాడీ పెయిన్స్ ఖాయం.. సైడ్ ఎఫెక్ట్స్ ఇవే..

Air-Conditioners
, సోమవారం, 11 సెప్టెంబరు 2023 (23:25 IST)
ఎయిర్ కండిషనింగ్ మానవ జీవితంలో ఒక భాగంగా మారింది. ప్రస్తుతం చాలా మంది ఏసీ గాలికి అలవాటు పడుతున్నారు. అయితే శరీరానికి చల్లటి గాలిని అందించినా.. ఎక్కువగా ఎయిర్ కండిషనర్ గాలిని ఎక్కువగా పీల్చడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు చర్మ సమస్యలతో పాటు శ్వాసకోశ సమస్యలకు గురవుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక మనం ఏసీ వల్ల శరీరంపై ఎలాంటి దుష్ప్రభావాలేంటో తెలుసుకుందాం.
 
శరీర నొప్పులు: ఎయిర్ కండీషనర్లను ఎక్కువసేపు ఉపయోగిస్తే శరీర నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే శరీరానికి తిమ్మిరి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కొందరిలో కీళ్ల నొప్పులు తప్పవు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఎక్కువ సేపు ఎయిర్ కండీషనర్‌లో ఉండకూడదు. అలాగే నడుము నొప్పి వచ్చే ప్రమాదం ఉంది.
 
డీహైడ్రేషన్: ఏసీలో ఎక్కువ సమయం గడపడం వల్ల కూడా తరచూ దాహం వేధించే అవకాశం ఉంది. అలాగే, తగినంత నీరు తాగకపోతే డీహైడ్రేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు కొందరికి తలనొప్పి కూడా రావచ్చు. కాబట్టి తరచూ తలనొప్పి సమస్యలతో బాధపడేవారు ఏసీలకు దూరంగా ఉండటం మంచిది.
 
 
 
చర్మం పొడిబారడాన్ని పెంచుతుంది: చర్మ సమస్యలతో బాధపడేవారు ఏసీలో గడపడం మానుకోవాలి. లేదంటే గాలిలో తేమ శాతం తగ్గి చర్మం పొడిబారే అవకాశాలు ఉన్నాయి. దీనితో పాటు, చర్మం తేమ కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు ఏసీలుండే ప్రాంతంలో ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హెర్బల్ టీలో చక్కెర వాడవచ్చా? వేడి చేసి వేడి చేసి తాగవచ్చా?