Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాత్రిపూట సూప్స్ ఓకే.. డిన్నర్ డైట్ లైట్‌గా ఉండాలి... బ్రొకోలి బెస్ట్..

రాత్రిపూట డిన్నర్‌‌కు ముందు క్లియర్ సూప్ తీసుకోవడం ద్వారా పొట్ట నిండిన అనుభూతి లభిస్తుంది. తద్వారా ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటారు. సూప్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే సూప్స్ ఎప్పుడూ పల్చగా ఉ

రాత్రిపూట సూప్స్ ఓకే.. డిన్నర్ డైట్ లైట్‌గా ఉండాలి... బ్రొకోలి బెస్ట్..
, బుధవారం, 19 అక్టోబరు 2016 (15:17 IST)
రాత్రిపూట డిన్నర్‌‌కు ముందు క్లియర్ సూప్ తీసుకోవడం ద్వారా పొట్ట నిండిన అనుభూతి లభిస్తుంది. తద్వారా ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటారు. సూప్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే సూప్స్ ఎప్పుడూ పల్చగా ఉండాలి. చిక్కగా ఉండే సూపులకు దూరంగా ఉండండి. వివిధ రకాల వెజిటేబుల్స్‌తో తయారుచేసి వెజ్ సూప్‌ను తీసుకోవచ్చు
 
అలాగే డిన్నర్లో హెల్దీ యాంటీఆక్సిడెంట్ ఫుడ్స్ ఉండేలా చూసుకోవాలి. బెల్ పెప్పర్స్‌లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ధాన్యాలు, మసాలా కంటే చిల్లీస్ లేదా పెప్పర్స్ ఆరోగ్యానికి మంచిది. అలాగే గ్రీన్ బీన్స్‌ను సలాడ్స్‌లో జోడించవచ్చు లేదా కర్రీలను తయారుచేసి తీసుకోవచ్చు. ఇవి శరీరానికి చాలా తక్కువ క్యాలరీలను అందిస్తుంది. రాత్రి డైట్ తద్వారా లైట్ అవుతుంది.
 
ఇకపోతే.. డిన్నర్ డైట్‌లో గ్రీన్ వెజిటేబుల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వండి. రాత్రిపూట ఫ్యాట్ మెటబాలిజం స్లోగా ఉంటుంది. కాబట్టి, బ్రొకోలీ చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. అనేక యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది. రాత్రి భోజనానికి చాలా ఆరోగ్యకరమైనదని న్యూట్రీషన్లు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పచ్చి పొటాటో జ్యూస్‌లో ఏముందో తెలుసా? కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుందట..