Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒత్తిడి నుంచి విముక్తికి వ్యాయామమే అత్యుత్తమ ఔషధమా?

ఒత్తిడి నుంచి విముక్తికి వ్యాయామమే అత్యుత్తమ ఔషధమా?
, మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (16:35 IST)
మానవదైనందిన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు.. ఉరుకుల పరుగుల జీవితంలో మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురవ్వడం సహజం. ఆర్థికం, సామాజికం, కుటుంబం, ఉద్యోగం, ప్రేమ ఇలాంటి పలు కారణాలు ఒత్తిడి కారణమవుతుంటాయి. ఈ ఒత్తిడిని నివారించుకునేందు రసాయన మందులపై ఆధారపడే కన్నా సహజసిద్ధంగా ఎలా నివారించుకోవచ్చు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం!
 
బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు 10 నిమిషాల పాటు సుదీర్ఘ శ్వాసను తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ ఉదయాన్నే ఈ వ్యాయామాన్ని పాటిస్తే చక్కటి ప్రయోజనం ఉంటుంది. వ్యాయామానికి మించిన ఔషధం మరొకటి లేదనే చెప్పాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా ఒత్తిడిని నివారించవచ్చు. ఉదయాన్నే వాకింగ్ చేయడం, సైక్లింగ్, జిమ్, జాగింగ్, యోగా వంటి వ్యాయామాలు చేయడం వల్ల ఒత్తిడి తొలగిపోవడంతో పాటు, ఆరోగ్యం, చక్కని శరీరాకృతి లభిస్తాయి.
 
సరైన తిండి తీసుకోకపోవడం వల్ల ఒత్తిడి తలెత్తుతుంది. తాజా పండ్లు, పండ్ల రసాలు, సలాడ్‌లు వంటివి తీసుకోవడం వల్ల కూడా ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు. అధిక ఫ్యాట్, అధిక కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు నిద్ర సరిగ్గా పట్టదు. కానీ సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి అటు ఎక్కువగా.. ఇటు తక్కువగా కాకుండా.. రోజుకు 8 గంటలపాటు నిద్రిస్తే ఒత్తిడి దూరమవుతుంది. వీలైనంత వరకూ పగటిపూట నిద్రకు దూరంగా ఉంటే మంచిది. ఎక్కువగా నిద్రపోవడం వల్ల శక్తిని కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి నిద్ర విషయంలో సరైన మెలకువలు పాటిస్తే.. ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు.
 
మీరు బాగా ఒత్తిడికి గురైనప్పుడు సినిమాకు వెళ్లడం, స్నేహితులను కలుసుకోవడం, మీకు ఇష్టమైన పుస్తకాలను చదుకోవడం, ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లడం వంటివి చేయడం కూడా మంచి ఫలితాలనిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోరింటాకు రెమ్మలు కణతలపై ఉంచుకుంటే...