Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శరీరాన్ని మైదా పిండి క్రమంగా చంపేస్తుందని తెలుసా..? పరోటా, సమోసా అసలేం చేస్తాయి?

మనం బయట తినే చపాతి, దోశ, పరోట, రోటి, తండూరీ.. ఇలా అన్నింటిలోనూ ఎక్కువగా ఉండే పిండి పదార్థం ఏదైనా ఉందంటే అది మైదానే.. మైదా వాడితే పదార్థాలు చూడటానికి ఆకర్షణీయంగానూ, తినడానికి రుచిగానూ ఉంటాయి. దీంతో ఇక అంతా ఆ హోటల్లో ఫలానాది తింటే చాలా బావుందని చెబుతుం

శరీరాన్ని మైదా పిండి క్రమంగా చంపేస్తుందని తెలుసా..? పరోటా, సమోసా అసలేం చేస్తాయి?
, మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (14:17 IST)
మనం బయట తినే చపాతి, దోశ, పరోట, రోటి, తండూరీ.. ఇలా అన్నింటిలోనూ ఎక్కువగా ఉండే పిండి పదార్థం ఏదైనా ఉందంటే అది మైదానే.. మైదా వాడితే పదార్థాలు చూడటానికి ఆకర్షణీయంగానూ, తినడానికి రుచిగానూ ఉంటాయి. దీంతో ఇక అంతా ఆ హోటల్లో ఫలానాది తింటే చాలా బావుందని చెబుతుంటారు. కాని మైదా పిండి వాడటం మూలాన వచ్చే నష్టాలు తెలిస్తే మళ్లీ జన్మలో వాటి జోలికి వెళ్లరు.
 
మైదాలో విషపూరిత రసాయనాలు…
* మిల్లులో బాగా పాలిష్ చేయబడిన గోధుమ పిండి. పసుపు రంగులో ఉండే గోధుమ పిండిని Azodicarbonamide, Chlorine gas, మరియూ Benzoyl peroxide అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు. 
* బెంజాయిల్ పెరాక్సైడ్ వాడుక చైనా ఐరోపా దేశాల్లో నిషేధించబడినది. మైదాలో Alloxan అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది. అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది. 
* గోధుమ పిండితో పోల్చితే సగం లేదా మూడో వంతు ధరకే లభించే మైదాను ఇప్పుడు అన్ని బేకరీ, హోటల్ ఫుడ్స్‌లో ఇష్టారీతిన వాడేస్తున్నారు.
 
మైదా తింటే ఆరోగ్యం ఇలా దెబ్బతింటుంది…
* మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా పీచు పదార్థం ఎంతోకొంత ఉండాలి. అది మైదాలో జీరో. కాబట్టి దానిని జీర్ణం చేయాలంటే మన జీర్ణాశయం అష్టకష్టాలు పడాలి. ఈ ప్రమాదంతో పేగుల్లో పుళ్లు సైతం ఏర్పడతాయి. అవి తీవ్రమైన ఇన్ఫెక్షన్లుగా మారితే కడుపులో తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులకూ దారితీస్తాయి.
* సినిమా పోస్టర్లను అంటించడానికి మైదా పిండినే ఎందుకు ఉపయోగిస్తారంటే అది గోడకు అంత పర్ఫెక్టుగా అంటుకుపోతుంది. 
* ఆ పిండితో చేసిన పదార్థాలు జీర్ణంకాక మన పేగులకూ అలాగే అతుక్కుపోతాయి. దీంతో పేగుల్లో క్రిములు ఉత్పత్తి అవుతాయి. అవి ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి.
* దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి రోగాలకూ దారితీస్తాయి.
* కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.
* గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. 
* మహిళలు బ్రెస్ట్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు.
* కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదాతో పొట్ట వస్తుంది. ఇక ప్రొటీన్లు చాలా నామమాత్రంగా ఉంటాయి.
* మైదాలో glycamic index చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఒంట్లో బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది.
* మైదాలో glycamic index చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఒంట్లో బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది.
* రోజూ మైదాతో చేసిన ఫుడ్స్ తీసుకుంటుంటే షుగర్ వచ్చేందుకు ఆస్కారమిచ్చినట్టే.
* స్వలాభం కోసం కష్టమర్ల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారికి తగిన శాస్తి జరగాలంటే మనం తినడం తగ్గిస్తే సరిపోతుంది. 
* ఆరోగ్య స్పృహతో వ్యవహరిస్తే చాలు. ఆ ఫుడ్స్ తినాలనిపించదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వీట్లు తింటే మేలేంటి..? ఫంక్షన్లలో ఆహారానికి ముందు స్వీట్ తీసుకుంటున్నారా?