Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నువ్వుల పొడిని అప్పడాలపై చల్లుకుని తింటే? (video)

Advertiesment
Sesame powder
, బుధవారం, 6 నవంబరు 2019 (14:11 IST)
నువ్వులతో తయారు చేసే ఏ ఆహారమైనా చాలా రుచికరంగా ఉంటుంది. నువ్వుల పొడిలో మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలున్నాయి. దీనిని రోజూ ఆహారంలో కలుపుకుని తింటే శరీరానికి చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. నువ్వుల పొడిని అప్పడాలపై చల్లుకుని తింటే ఎంతో మేలు చేస్తుంది. పరిమాణంలో చాలా చిన్నవిగా ఉండే నువ్వుల్లో మన శరీరానికి ఉపయోగకరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి.
 
వీటిలో క్యాల్షియం, మెగ్నీషియం. ఐరన్‌, ఫాస్పరస్‌, విటమిన్‌ బి, జింక్‌, పీచుపదార్థాలు తదితర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రకరకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. నువ్వుల్లో ఉండే కాపర్ రుమటాయిడ్‌ ఆర్థ్రరైటిస్‌ వల్ల కలిగే నొప్పిని, వాపును తగ్గించడంలో సహకరిస్తుంది. ఆస్తమాను అరికట్టడంలో నువ్వులపొడిలోని మాంగనీస్‌ బాగా ఉపకరిస్తుంది.
 
గుండెపోటు, స్ట్రోక్స్‌కు కారణమయ్యే రక్తపోటును నివారించడంలో కూడా నువ్వులపొడిలోని మాంగనీస్‌ ఉపకరిస్తుంది. కలోన్‌ క్యాన్సర్‌, ఆస్టియోపోరోసిస్‌, మైగ్రేన్‌, రుతుస్రావానికి ముందు కలిగే సమస్యలను అరికట్టడంలో వీటిలోని క్యాల్షియం తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించి బరువు అదుపులో ఉంచగల గుణాలు నువ్వుల్లో ఉన్నాయి. నువ్వుల పొడిని తరచూ తీసుకుంటే రకరకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుక్కర్‌లో వండిన అన్నం ఆరగిస్తున్నారా?