టమోటా జ్యూస్ మంచిదే.. కానీ టమోటా సాస్‌తో రోగాలే.. ఎలాగంటే?
టమోటా జ్యూస్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు. అయితే టమోటా సాస్ మాత్రం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఫాస్ట్ ఫుడ్ తినేటప్పుడు సాస్ తప్పనిసరిగా ఉపయోగిస్తారు. కొందరైతే తిండి తక్కువ
టమోటా జ్యూస్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు. అయితే టమోటా సాస్ మాత్రం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఫాస్ట్ ఫుడ్ తినేటప్పుడు సాస్ తప్పనిసరిగా ఉపయోగిస్తారు. కొందరైతే తిండి తక్కువ సాస్ ఎక్కువ తింటారు. కానీ సాస్ సురక్షితం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
టమోటా సాస్‌లో పంచదార, ఉప్పు, వెల్లుల్లి, ఉల్లిపాయ, ఫుడ్ కలర్ లాంటి మరెన్నో పదార్థాలు కలుపుతారు. వీటి ద్వారా డయాబెటిస్, బీపీ లాంటి ఇంకెన్నో రోగాలు రావడం ఖాయమంటున్నారు. టమాటా సాస్‌ను తయారు చేసేందుకు.. సాస్ గుజ్జు రావటానికి టమాటాకి బదులుగా పుచ్చకాయ, బొప్పాయి లాంటి పండ్ల నుండి తీసిన పిప్పిని వాడుతారు. సాధారణంగా ఇలాంటి సాస్ రోడ్ సైడ్ లభిస్తూ ఉంటాయి. సాస్ తయారుచేసే సమయంలో నాణ్యత, పరిశుభ్రత పాటించరు. ఇది ఖచ్చితంగా అనేక వ్యాధులకు గురి చేస్తుంది. సాస్‌లో వాడే ఫుడ్ కలర్ ద్వారా ఎలర్జీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
టమాటాలో ఉండే విటమిన్-A, విటమిన్-C, ఫైబర్ లాంటి ముఖ్య పోషక గుణాలు.. సాస్‌గా చేసేటప్పుడు కోల్పోతాయి. ఊబకాయంతో బాధపడుతున్నవారు ఎలర్జీ, ఆస్తమా వంటివి ఉన్నవారు టమాటా సాస్ నుండి దూరంగా ఉండటం మంచిది. డయాబెటిస్, బీపీ ఉన్నవారు సాస్ జోలికి వెళ్లకపోవడం మరీ మంచిది.
టమాటా సాస్‌ను రోజూ లాగించేస్తే ప్రమాదం. టమాటా సాస్‌కి బదులుగా ఇంట్లో చేసుకునే పుదినా, కొత్తిమీర, కరివేపాకు లాంటి చట్నీలు ఎంతో మంచివి. వీటిని రోజు తిన్నా ఫరవాలేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అదే టమోటా జ్యూస్‌ని రోజుకు రెండు గ్లాసుల టమోటా రసం తాగినట్టయితే ఎముకలు బలంగా తయారవుతాయి. అంటే ఆస్టియోపోరొసిస్ రాకుండా ఉంటుంది. దీనికి కారణం టొమాటోలో లైకోపీన్ అనే యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటివల్ల ఎముకలు చాలా దృఢంగా ఉండేలా చేస్తాయి.