Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సంక్రాంతి: పెద్ద పండుగకి బాదంపప్పులను జోడించడం ద్వారా ఆరోగ్యవంతంగా మార్చుకోండి

health with almonds
, మంగళవారం, 2 జనవరి 2024 (19:03 IST)
కేకులు, కేరింతలు, గాలిపటాలతో కూడిన వేడుకల సీజన్ వచ్చేసింది! పండుగ సీజన్లో విందులు ఖచ్చితంగా మన ఉత్సాహాన్ని పెంచుతాయి. అయితే,  అతిగా తినడం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలో సుమారు 101 మిలియన్ల మంది మధుమేహంతో జీవిస్తున్నారని, మరో 136 మిలియన్ల మంది ప్రజలు ప్రీ-డయాబెటిస్ దశలో ఉన్నారని అంచనా.
 
ఈ పండుగ సీజన్‌లో మన ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ సీజన్లో తెలివైన ఆహార ఎంపికలు చేసుకోవాలి. ఇక్కడ బాదం కీలక పాత్ర పోషిస్తుంది. బాదం మన శరీరానికి ముఖ్యమైన విటమిన్ E, మెగ్నీషియం, రైబోఫ్లావిన్, జింక్, ప్రోటీన్ వంటి 15 పోషకాలకు మూలం. ఈ పోషకమైన గింజలను మన రోజువారీ సమతుల్య ఆహారంలో క్రమంతప్పకుండా చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. 
 
బాదంపప్పులు ప్రయాణంలో ఉన్నప్పుడు తీసుకువెళ్లి తినగలిగే సౌకర్యవంతమైన ప్రయాణ చిరుతిండి. వీటిని మన ఆహారం, డెజర్ట్‌లలో అలంకరించడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇంకా, బాదంపప్పులను అల్పాహారంగా తీసుకోవడం వల్ల ఆకలిని సమర్థవంతంగా అరికట్టవచ్చు,  బరువు తగ్గడంలో సమర్థవంతంగా ఇది తోడ్పడుతుంది. ప్రముఖ బాలీవుడ్ నటి, సెలబ్రిటీ సోహా అలీ ఖాన్ ఇలా మాట్లాడుతూ, “పండుగ సీజన్లో స్వీట్లు, నాకు ఇష్టమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతాను. కానీ, ఆరోగ్యకరమైన ట్విస్ట్‌ను జోడించడానికి, బాదం నా మొదటి ఎంపిక. పండుగ సీజన్‌లో లేదా మరేదైనా సరే, నా రోజువారీ ఆహారంలో కొన్ని ఇతర ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలతో పాటు బాదంపప్పును చేర్చుకుంటాను" అని అన్నారు. 
 
ఫిట్‌నెస్- సెలబ్రిటీ ఇన్‌స్ట్రక్టర్, యాస్మిన్ కరాచీవాలా మాట్లాడుతూ, పండుగ సీజన్‌లో తమకు ఇష్టమైన స్వీట్‌లు- ఆహారాలను తీసుకోవచ్చు కానీ  మితంగా తినాలి. ఏదో ఒక రకమైన వ్యాయామంతో తీసుకున్న కేలరీలు కరిగించాలి. పండుగ/సెలవు కాలంలో కఠినమైన వర్కవుట్‌లలో పాల్గొనకపోవటం ఫర్వాలేదు కానీ యోగా లేదా చురుకైన నడక వంటి తేలికపాటి వ్యాయామాలను చేర్చుకోవడం ప్రయోజనకరమన్నారు. 
 
రితికా సమద్దర్, రీజినల్ హెడ్-డైటెటిక్స్, మాక్స్ హెల్త్‌కేర్, ఢిల్లీ మాట్లాడుతూ, "పండుగ సమయాన్ని ఆనందించాలి కానీ వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టకూడదు. మనం తినే ఆహారంలో బాదం వంటి వస్తువులను చేర్చడం వల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడటానికి తోడ్పడుతుంది. ఆహారం నుండి శక్తిని విడుదల చేయడంలో ఇవి గుర్తింపు పొందిన పోషకాలు" అని అన్నారు. 
 
న్యూట్రిషన్ అండ్ వెల్‌నెస్ కన్సల్టెంట్, షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ, "పండుగ సమయాల్లో కూడా సమతుల్య భోజనం యొక్క ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనది. పండుగ ఆహారాన్ని ఆరోగ్యకరమైనదిగా చేయడానికి, బాదం వంటి పోషకాలను జోడించడాన్ని పరిగణించండి. ఈ పండుగ సీజన్‌లో మీకు ఇష్టమైన వంటకాలను ఆస్వాదించండి, మీ ఆహారంలో బాదంపప్పును చేర్చుకోవడం మర్చిపోవద్దు" అని అన్నారు. ఇంటిగ్రేటివ్ న్యూట్రిషనిస్ట్, హెల్త్ కోచ్, రోహిణి పాటిల్ మాట్లాడుతూ, "సంతోషకరమైన రుచిని జోడించడంతోపాటు, బరువు నిర్వహణ, మధుమేహం నియంత్రణ సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలను బాదం అందిస్తుంది. బాదంపప్పును రోజువారీ తీసుకోవడం వల్ల రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో ముడతల తీవ్రతను తగ్గించడంలో కూడా దోహదపడుతుంది" అని అన్నారు. 
 
ప్రఖ్యాత కన్నడ నటి, ప్రణీత సుభాష్ మాట్లాడుతూ, “బాదంపప్పు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే అవి ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి అవసరమైన పోషకాలను అందిస్తాయి" అని అన్నారు. ప్రఖ్యాత భారతీయ చలనచిత్ర & టెలివిజన్ నటి, వాణి భోజన్ మాట్లాడుతూ, “శరీరానికి అవసరమైన పోషకాహారంలో కొంత భాగాన్ని పొందేలా బాదం చేస్తుంది. మీ ఆరోగ్యంపై ఎక్కువగా రాజీ పడకుండా పండుగ సీజన్‌లో గొప్ప ఆహారాన్ని ఆస్వాదించవచ్చని నిర్ధారిస్తుంది.." అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ 2024 కొత్త సంవత్సరంలో ఆరోగ్యంగా వుండేందుకు చిట్కాలు