పరగడుపున మాత్రం నేరేడు పండ్లు తీసుకోకూడదట.. ఎందుకు? నెలసరిలో నీరసానికి దివ్యౌషధం!
నేరేడుపండ్ల సీజన్ జరుగుతోంది. మార్కెట్లలో నేరేడు పండ్లు విరివిగా దొరుకుతున్నాయి. వీటిని ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. వర్షాకాలంలో రోగనిరోధక శక్తి చాలా అవసరం. అందుచేత ఈ
నేరేడుపండ్ల సీజన్ జరుగుతోంది. మార్కెట్లలో నేరేడు పండ్లు విరివిగా దొరుకుతున్నాయి. వీటిని ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. వర్షాకాలంలో రోగనిరోధక శక్తి చాలా అవసరం. అందుచేత ఈ పండ్లను తీసుకోవడం ద్వారా విటమిన్ సి లభిస్తుంది. ఇది ఇమునిటీని పెంచుతుంది.
అయితే నేరేడు పండ్లను ఎట్టి పరిస్థితుల్లో పరగడుపున తీసుకోకూడదు. తప్పనిసరిగా ఏదన్నా తిన్నాకే స్వీకరించాలని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఇందులో విటమిన్ సితో కొన్ని ఆమ్లాల ఉత్పన్నానికి కారణమవుతుందని తద్వారా అసిడిటీ సమస్యలు తలెత్తే ఆస్కారాలున్నట్లు వారు చెప్తున్నారు. అందుకే ఆహారానికి తర్వాత నేరేడు పండ్లను తీసుకోవాలని సూచిస్తున్నారు.
నేరేడు పండ్లలో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం, విటమిన్ సి, థయామిన్, ఫోలిక్ యాసిడ్, పీచు, ప్రొటీన్లు, కెరొటిన్లు పుష్కలంగా లభిస్తాయి. నెలసరి సమయంలో బాగా నీరసపడిపోయే అమ్మాయిలు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందుతుంది. శరీరానికి సరిపడా ఇనుము అందుతుంది.
వందగ్రాముల నేరేడు పండ్లలో 50 శాతం పొటాషియం ఉంటుంది. గుండె, మధుమేహం, రక్తపోటు ఉన్నవారు ఒక పండు తింటే సరిపోతుంది. అరుగుదల సరిగా లేనప్పుడు కప్పు పెరుగులో నాలుగు చెంచాల నేరేడు పండు రసం కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
చిగుళ్ల నుంచి రక్తం కారడం, దంతాలు పుచ్చిపోవడం.. దుర్వాసన రావడం వంటి సమస్యలకు నేరేడు పండ్లు చక్కటి పరిష్కారం. వీటిని నమిలినప్పుడు పులుపూ, తీపి, వగరు కలబోతగా ఉండే రసం బ్యాక్టీరియాలను దూరం చేస్తుంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.