Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శృంగారంలో అసంతృప్తి? అయితే రాత్రి పిజ్జా తినడం ఆపేయండి.. బాదం మిల్క్ తాగండి

శృంగార జీవితంపై పిజ్జా ప్రభావం చూపుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. శృంగారంలో సంతృప్తి కలుగకపోతే.. జంక్ ఫుడ్ తినడం పూర్తిగా మానేయాలని సెక్సాలజిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే పిజ్జా కోసం ఉపయోగించే బేస్

Advertiesment
Pizza Is Not Good For Sexual Health
, బుధవారం, 18 జనవరి 2017 (11:00 IST)
శృంగార జీవితంపై పిజ్జా ప్రభావం చూపుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. శృంగారంలో సంతృప్తి కలుగకపోతే.. జంక్ ఫుడ్ తినడం పూర్తిగా మానేయాలని సెక్సాలజిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే పిజ్జా కోసం ఉపయోగించే బేస్‌ను మైదాపిండితో చేస్తారు. మైదాపిండి శృంగార భావాలను తగ్గిస్తుంది. రాత్రిపూట పిజ్జాలు తినడం ద్వారా అజీర్తికి కారణమవుతుంది. హార్మోన్ల నియంత్రించడంతో లైంగిక జీవితం నిస్సారంగా మారుతుంది. 
 
అందుకే రాత్రి పూట శృంగారానికి ముందు పిజ్జాలు తినడం, శీతలపానీయాలు తాగడం చేయకూడదని.. పిజ్జాల తినడం ద్వారా కడుపు ఉబ్బరం ఏర్పడుతుంది. ఇవి శృంగారానికి అడ్డుగా మారుతాయి. శీతల పానీయాలకు బదులు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. పిజ్జాలను శృంగారానికి ముందు తినకపోవడం చాలా మంచిది. అలాగే మసాలా పదార్థాలు తినకూడదు. తినాలనిపిస్తే పాస్తాను సాస్‌తో ఎంచుకోవచ్చు. ఇందులో వెల్లుల్లి, చీస్ లేకుండా చూసుకోవడం మంచిది. రాత్రిపూట వెల్లుల్లి, ఉల్లి తినకూడదు. బీన్స్ తినడం మానేయాలి. బీన్స్‌లో చక్కెర శాతం అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణం కావు. ఇవి కడుపు నొప్పికి కారణమవుతాయి. 
 
ఇకపోతే.. శృంగారంలో ప్రతి రోజూ పాల్గొనడం వల్ల ఎనలేని ప్రయోజనాలు ఉంటాయని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. భార్యభర్తల మధ్య బంధం పటిష్టం కావడమే కాకుండా పగటి పూట, రోజూవారీ పనుల్లో చిరాకు, ఒత్తిడి తగ్గుతుందని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. ఉదయం చేసే జాగింగ్ కంటే ఎన్నో రెట్లు సెక్స్ ఉత్తమం అంటున్నారు వైద్య నిపుణులు.
 
అలసిపోయి ఇంటికొచ్చిన వెంటనే మీకు నచ్చిన స్వీట్స్ తీసుకోవడం ద్వారా స్టామినా పెంచుకోవచ్చని, తద్వారా రోజంతా కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చనిని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ శృంగారానికి ముందు ఆహారాల్లో పచ్చికూరలు, చేదుగా, వగరుగా ఉండే కూరగాయలు తినడం కన్నా కొన్ని ఆరోగ్యకరమైన తీపి పదార్థాలు తీసుకోవడం మంచిది. తీపి పదార్థాలు తీసుకుంటే మీ భాగస్వామితో సంభోగం కూడా మధురంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. 
 
సలాడ్స్‌లో టమోటోల ముక్కలను జోడించి డిన్నర్‌కు ముందు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే శృంగారానికి ముందు ఒక గ్లాస్ బాదం మిల్క్ త్రాగడం వల్ల మంచి శక్తిని పొందవచ్చు. శృంగారంలో పాల్గొనడానికి ముందు చాక్లెట్ తినడం వల్ల మీ స్టామినా పెరుగుతుంది. 
 
అందరూ ఎంతో ఇష్టంగా తినే దానిమ్మ పండు శృంగారానికి మంచి ప్రేరేపకంగా పనిచేస్తుంది. టెస్టోస్టిరాన్‌ స్థాయులను పెంచడంతో పాటు స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ లైంగికపరమైన కోరికలను పెంచే శక్తి దానిమ్మ జ్యూస్‌కు ఉంది. దానిమ్మ గింజలు శరీరంలో రక్తప్రసరణను నియంత్రిస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నల్లటి మచ్చలున్న అరటిపండు ఆరగిస్తే ఆరోగ్యానికి హానికరమా?