Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిస్తా పప్పు తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో....

ఎన్ని రకాల ఆహారపదార్ధాలు తీసుకున్నా వాటన్నింటిలో 'పిస్తా' పప్పుకు ఉన్న ప్రత్యేకతే వేరు. దీనిని ఆహారంలో ఒక భాగంగా మార్చుకోవడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. పిస్తాను క్రమంతప్పకుండా తీసుకోవడం వలన నేత్ర సమస్యలు తగ్గుతా

Advertiesment
pista health benefits
, శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (16:29 IST)
ఎన్ని రకాల ఆహారపదార్ధాలు తీసుకున్నా వాటన్నింటిలో 'పిస్తా' పప్పుకు ఉన్న ప్రత్యేకతే వేరు. దీనిని ఆహారంలో ఒక భాగంగా మార్చుకోవడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. పిస్తాను క్రమంతప్పకుండా తీసుకోవడం వలన నేత్ర సమస్యలు తగ్గుతాయి కంటిచూపు స్పష్టంగా ఉండడానికి ఇందులోని పోషకాలు దోహదం చేస్తాయి. శరీరంలో విడుదలైన వ్యర్థాలను పిస్తా పప్పులు దూరం చేస్తాయి. 
 
ఈ పప్పులోని విటమిన్‌ 'ఇ' చర్మం మీది మృతకణాలను తొలగించి దానిని మృదువుగా ఉంచుతుంది. పిస్తా పప్పును తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. కణాలు దెబ్బ తినకుండా ఉంటాయి. అన్ని శరీర భాగాలకూ రక్తం సక్రమంగా అందడానికి పిస్తా దోహదం చేస్తుంది. రోజూ కొన్ని పిస్తా పప్పులు తినడం వల్ల శరీరంలో చెడు కొవ్వు నిల్వలు దూరమవుతాయి. పిస్తా తినడం వలన రక్తపోటు సమస్యలు రావు. నరాల్లో రక్తం కూడా గడ్డ కట్టదు.
 
పిస్తాలో ఉండే పీచుపదార్ధం జీర్ణక్రియకు దోహదం చేస్తుంది. ఫాస్పరస్‌ అధికంగా ఉండే వాటిల్లో ఒకటైన పిస్తా పప్పు శరీరానికి ప్రొటీన్లనూ, అమైనో ఆమ్లాలను అందిస్తుంది. మధుమేహ వాధి ఉన్నవారికి పిస్తా వల్ల చాలా మేలు. ఇది ఇన్సులిన్‌ శాతాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
 
పిస్తా పప్పు క్యాన్సర్లు రాకుండా కాపాడుతుందని తాజా పరిశోధనల్లో రుజువైంది. బాదం పప్పు కన్నా అధికంగా పోషక పదార్థాలు పిస్తా పప్పులో ఉన్నాయి. ఇందులో పొటాషియం, బి6 విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల శరీరం ప్రోటీన్లను ఎక్కువగా గ్రహిస్తుంది. డ్రై ఫ్రూట్స్‌ అన్నింటితో పోలిస్తే ఈ పప్పులో క్యాలరీలు తక్కువగా ఉన్నాయి. 
 
గుండె జబ్బులను తగ్గించే గుణం పిస్తాలో ఉంది. యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, పీచుపదార్ధాలు, విటమిన్లు కూడా ఇందులో అధికంగా ఉన్నాయి. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను పిస్తా పప్పు తగ్గిస్తుంది. తక్కువ తిన్నా కడుపు నిండినట్లన్పిస్తుంది. దీంతో బరువు తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. కేవలం 30 గ్రాముల పిస్తా పప్పు తింటే చాలు శరీరానికి 160 క్యాలరీల శక్తి వెంటనే లభిస్తుంది. పిస్తా పప్పు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. శరీరానికి హాని కలిగించే కొవ్వు పదార్థాలు ఇందులో ఉండవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డయాబెటీస్‌తో బాధపడుతున్నారా? వంకాయ తినండి..