వళ్లు నొప్పులు... పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే ఏమవుతుంది?
వళ్లు నొప్పులు, దేహంలో ఎక్కడైనా పట్టేసినట్లు అనిపిస్తే చాలు వెంటనే పెయిన్ కిల్లర్ మాత్ర తెచ్చుకుని వేసేసుకుంటుంటారు చాలామంది. ఐతే ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల తాత్కాలికంగా నొప్పి తగ్గినప్పటికీ వేరు దుష్ఫలితాలు తలెత్తుతాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ముఖ్
వళ్లు నొప్పులు, దేహంలో ఎక్కడైనా పట్టేసినట్లు అనిపిస్తే చాలు వెంటనే పెయిన్ కిల్లర్ మాత్ర తెచ్చుకుని వేసేసుకుంటుంటారు చాలామంది. ఐతే ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల తాత్కాలికంగా నొప్పి తగ్గినప్పటికీ వేరు దుష్ఫలితాలు తలెత్తుతాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా ఈ పెయిన్ కిల్లర్స్‌ను వాడేవారిలో అల్సర్, రక్తపోటు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు.
కడుపులో మంట, నొప్పి, వాపు, కండరాలు, ఎముకలకు సంబంధించిన వ్యాధుల నివారణకు నాన్‌స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లామెటరి డ్రగ్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారనీ, ఈ మందులు వాడినప్పుడు సదరు సమస్య తగ్గినప్పటికీ కొత్త సమస్య పట్టుకుంటుందని చెపుతున్నారు. ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల గుండెపోటు కూడా రావచ్చని హెచ్చరిస్తున్నారు.
కనుక వైద్యులను సంప్రదించకుండా నొప్పి తగ్గేందుకు పెయిన్ కిల్లర్స్ వాడటం చాలా ప్రమాదకరం అని చెపుతున్నారు. కానీ వైద్యుల సలహా లేకుండా చాలామంది నొప్పులు తగ్గేందుకు మందుల షాపులో పెయిన్ కిల్లర్స్ కొనేసి వేసేసుకుంటున్నారనీ, దీనివల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వారు హెచ్చరిస్తున్నారు.