Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాత్రిపూట అధికంగా తినేస్తే ఏమవుతుందో తెలుసా?

శరీర శ్రమ పూర్తిగా తగ్గిపోయిన ఈ కాలంలో ముప్పూటలా ఫుల్లుగా తింటే ముప్పేనంటున్నారు. టెక్నీషియన్లు... ప్రత్యేకించి రాత్రివేళ అతిగా తినేసే అలవాటు స్థూలకాయం రావడానికి, అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలు తలెత్తడానికి కారణం అవుతుందని చెపుతున్నారు. ఆరోగ్య శాస్త్

రాత్రిపూట అధికంగా తినేస్తే ఏమవుతుందో తెలుసా?
, శనివారం, 6 మే 2017 (19:42 IST)
శరీర శ్రమ పూర్తిగా తగ్గిపోయిన ఈ కాలంలో ముప్పూటలా ఫుల్లుగా తింటే ముప్పేనంటున్నారు. టెక్నీషియన్లు... ప్రత్యేకించి రాత్రివేళ అతిగా తినేసే అలవాటు స్థూలకాయం రావడానికి, అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలు తలెత్తడానికి కారణం అవుతుందని చెపుతున్నారు. ఆరోగ్య శాస్త్రం ప్రకారం, ఉదయం తిన్న ఆహారం మోతాదులో సగం మధ్యాహ్నం, ఇందలో సగం రాత్రివేళ తినాలి. ఎందుకంటే సూర్య గమనానికి జీర్ణశక్తికీ సంబంధం వుంది. సూర్యోదయం వేళ వుండే జీర్ణశక్తిలో 60 శాతమే రాత్రివేళ వుంటుంది. 
 
భోజనం మోతాదు కూడా అదే నిష్పత్తిలో తగ్గుతూ రావాలి. కానీ, ఉద్యోగ వ్యాపారాల ఒత్తిళ్లు కారణంగా ఉదయం, మధ్యాహ్నం హడావుడిగా తినేస్తారు. రాత్రివేళ ఆ ఒత్తిళ్లు పెద్దగా ఉండకపోవడం వల్ల మనసు కూడా కుదురుగా ఉండి ఎక్కువగా తినేస్తుంటారు. ఏక భుక్తం యోగి, ద్విభక్తం భోగి, త్రిభుక్తం రోగి అన్న ఆరోగ్య సూత్రం ఒకటి వుంటుంది. 
 
వ్యాయామాలు, శరీర శ్రమ అసలే లేకుండా పోయిన ఈ దశలో ఉదయం, మధ్యాహ్నం చేసిన భోజనాల్లోని కేలరీలే శరీర పోషణకు సరిపోతాయి. అయినా అంతటితో ఆగక మూడోసారి కూడా తినేసిన తాలూకు కేలరీలు శరీరంలో అదనంగా ఉండిపోతాయి. అందుకో భోజనానంతరం తీసుకున్న ఆహారం ద్వారా వచ్చే కేలరీలు లేని కీర దోస లాంటివి లేదా అతి తక్కువ కేలరీలున్న ఆహార పదార్థాలుగానీ తీసుకోవడం మేలు. డిన్నర్ లో తీసుకునే ఆహార పదార్థాలు ఎక్కువ పీచు పదార్థం తక్కువ క్యాలరీలతో వుండేలా చూసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుర్చీకే అతుక్కుపోతే.. ఒత్తిడి తప్పదు.. కాస్త లేవండి.. నాలుగడుగులు వేయండి..