Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కిడ్నీలో రాళ్ల బాధకు చెక్ ఎలా? ఆరెంజ్ జ్యూసే దివ్యౌషధం!

Advertiesment
Orange juice
, బుధవారం, 21 అక్టోబరు 2015 (17:39 IST)
ఆపరేషన్స్ చేయించుకున్నాక కూడా కొందరికి కిడ్నీలో రాళ్లున్నాయని వైద్యులు చెప్తుంటారు. కిడ్నీలో రాళ్లను నివారించాలంటే రోజుకో గ్లాసు నారింజపండ్ల రసం తాగితే చాలు... రాళ్ల బాధ మాయమవుతుంది. ఎన్నిసార్లు శస్త్రచికిత్స చేయించుకున్న చాలా మందిని కిడ్నీలో రాళ్ల సమస్య మళ్లీ మళ్లీ బాధపెడుతుంటుంది. ఇలాంటి వారు రోజూ నారింజ పండ్లరసం తీసుకుంటే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. 
 
కాల్షియం వంటి రసాయనాల గాఢత విపరీతంగా పెరిగిపోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. ఆపరేషన్ ద్వారా వీటిని తొలగించినప్పటికి తిరిగి మళ్లీ రాళ్లు ఏర్పడుతూనే ఉంటాయి. పొటాషియం సిట్రేట్ సప్లిమెంట్లు వాడడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు నివారించవచ్చు.
 
కాబట్టి సహజసిద్ధమైన సిట్రేట్‌లు లభించే సిట్రస్ ఫలాలను తీసుకోమని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ సిట్రేట్‌లు నారింజలో పుష్కలంగా ఉన్నాయి. మిగిలిన సిట్రస్ ఫలాల కన్నా నారింజపండ్లలోని సిట్రేట్లు మరింత సమర్ధవంతంగా పనిచేస్తాయని టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.

Share this Story:

Follow Webdunia telugu