కిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెప్పారా? ఐతే ఆరెంజ్ జ్యూస్ తాగండి
కిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెప్పారా? ఐతే ఆరెంజ్ జ్యూస్ తాగండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరెంజ్ జ్యూస్‌ని ప్రతి రోజు క్రమం తప్పకుండా త్రాగితే మూత్రపిండాల వ్యాధులను నిరోధిస్తుంది. అలాగే మూత్రపి
కిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెప్పారా? ఐతే ఆరెంజ్ జ్యూస్ తాగండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరెంజ్ జ్యూస్‌ని ప్రతి రోజు క్రమం తప్పకుండా త్రాగితే మూత్రపిండాల వ్యాధులను నిరోధిస్తుంది. అలాగే మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని వారు సూచిస్తున్నారు.
ఆరెంజ్‌లో కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉండటం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటం సులువవుతుంది. ఆరెంజ్‌లో పొటాషియం సమృద్దిగా ఉంటుంది. ఈ ఎలక్ట్రోలైట్ ఖనిజం గుండె పనితీరును మెరుగు పరుస్తుంది. ఆరెంజ్‌లో పోలిఫెనోల్స్ సమృద్దిగా ఉండుట వలన వైరల్ ఇన్ఫెక్షన్స్‌కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది.
అలాగే ఆరెంజ్ పండ్లను తినడం ద్వారా కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని తెలిసింది. ఆరెంజ్‌లో ఉండే కెరోటినాయిడ్ అని పిలిచే విటమిన్ ఏ కాంపౌండ్స్ క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. ఆరెంజ్‌లో లిమోనాయిడ్స్ సమృద్ధిగా ఉండుట వలన చర్మ, ఊపిరితిత్తుల, రొమ్ము, కడుపు, ప్రేగు క్యాన్సర్ వంటి అనేక క్యాన్సర్ రకాల మీద పోరాటానికి సహాయపడుతుంది.