Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీ బ‌రువెంత‌? బీఎంఐ 85 శాతం క‌న్నా ఎక్క‌వైతే...

వివిధ ర‌కాల జబ్బులకు కారణం అధిక బరువు క‌లిగి ఉండ‌టం. చాలామంది బరువు పెరగకుండా చూసుకోవడానికి ఏ మాత్రం ప్రయత్నించడం లేదు. మ‌రికొంతమంది అధిక బరువు పెరిగాక తగ్గడానికి ప్రయత్నించి విఫలమవుతుంటారు. అటువంటి వారికి హోమియో మందులు చక్కని పరిష్కారాన్ని చూపిస్తాయ

మీ బ‌రువెంత‌? బీఎంఐ 85 శాతం క‌న్నా ఎక్క‌వైతే...
, సోమవారం, 2 మే 2016 (13:54 IST)
వివిధ ర‌కాల జబ్బులకు కారణం అధిక బరువు క‌లిగి ఉండ‌టం. చాలామంది బరువు పెరగకుండా చూసుకోవడానికి ఏ మాత్రం ప్రయత్నించడం లేదు. మ‌రికొంతమంది అధిక బరువు పెరిగాక తగ్గడానికి ప్రయత్నించి విఫలమవుతుంటారు. అటువంటి వారికి హోమియో మందులు చక్కని పరిష్కారాన్ని చూపిస్తాయని అంటున్నారు హోమియో వైద్యనిపుణులు. శారీరక శ్రమ లేకపోవడం, జీవన విధానంలో మార్పులు స్థూలకాయానికి దారి తీస్తుంది. ఇందువల్ల డయాబెటిస్, ఆర్థరైటిస్, గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. అయితే అధిక బరువు ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడానికి బాడీమాస్ ఇండెక్స్ ఉపయోగపడుతుంది. 
 
బీఎమ్ఐ 5 శాతం కన్నా తక్కువ ఉన్న వారు తక్కువ బరువు ఉన్న వ్యక్తుల కేటగిరీకి చెందుతారు. బీఎమ్ఐ 5 శాతం కన్నా ఎక్కువ, 85 శాతం కన్నా తక్కువ ఉన్నవారు సామాన్య బరువు ఉన్న వ్యక్తుల కేటగిరీలోకి వస్తారు. బీఎమ్ఐ 85 శాతం కన్నా ఎక్కువ, 95 శాతం కన్నా తక్కువ ఉంటే అధిక బరువు ఉన్నట్లుగా, 95 శాతం కన్నా ఎక్కువ ఉన్నట్లయితే స్థూలకాయంతో బాధపడుతున్నట్లుగా భావించాలి.
 
స్థూలకాయం వల్ల కలిగే సమస్యలు
అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరగడం, మధుమేహం, కీళ్లనొప్పులు, ఊపిరాడకపోవడం, ఆస్తమా, నిద్రలేమి, కాలేయ, పిత్తాశయ వ్యాధులు రావడం, డిప్రెషన్, గుండె జబ్బులు రావడం, అమ్మాయిల్లో రుతుస్రావ సమస్యలు, పీసీఓడి వంటి సమస్యలు రావడం జరుగుతుంది.
 
స్థూలకాయం రావ‌డానికి కారణాలు
జన్యుపరమైన సమస్యలు, హార్మోన్ల సమస్యలు కూడా అధిక బరువుకు కారణాల‌వుతాయి. జన్యుపరంగా తల్లిదండ్రులు అధిక బరువుతో బాధపడుతున్నట్లయితే పిల్లలకు అది వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబంలోని వ్యక్తుల ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ ఒకే విధంగా ఉన్నట్లయితే పిల్లల వైఖరి అలాగే ఉంటుంది. ఫాస్ట్‌ఫుడ్స్ తినడం, శారీరక శ్రమ లేకపోవడం, టీవీ, కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం గడపడం, వీడియోగేమ్స్ ఆడటం వల్ల స్థూలకాయం బారిన పడుతున్నారు. స్కూలు పిల్లలు సైతం ఇంటికి రాగానే టీవీ ముందు, వీడియో గేమ్స్ ఆడుకుంటూ గడిపేస్తుంటారు. ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీ పూర్తిగా లోపించడం అధిక బరువుకు కారణమవుతుంది.
 
స్థూలకాయం త‌గ్గించుకోవ‌డానికి ఇలా చేయాలి
పౌష్ఠికాహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. పిల్లలు క్రికెట్, టెన్నిస్, వాలీబాల్ వంటి ఆటలు ఆడుకునేలా ప్రోత్సహించాలి. ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. స్వీట్స్‌కు దూరంగా ఉండాలి. పిల్లలు ఆకలిగా ఉన్నప్పుడే తినిపించాలి. అధిక బరువుకు కారణమయ్యే చిరుతిళ్లకు దూరంగా ఉంచాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజూ ఓ బెల్లం ముక్క తింటే ప్రయోజనం ఏంటి..?