కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడం.. సెలవు దినాల్లో టీవీలకు అతుక్కుపోవడం ద్వారా ఒబిసిటీ చాలామందిని వేధిస్తుంది. శారీరక శ్రమ లేకపోవడంతో పాటు గంటల పాటు కుర్చీల్లో కూర్చోవడం ద్వారా స్థూలకాయం తప్పట్లేదు. అయితే స్థూలకాయంతో గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని అందుచేత ఒబిసిటీని నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఒబిసిటీని దూరం చేసుకోవాలంటే.. వ్యాయామం తప్పనిసరి కావాలి. అవసరమైన దానికంటే ఎక్కువగా తినడం, తక్కువగా మాత్రమే శారీరకంగా శ్రమపడటం స్థూలకాయానికి దారితీస్తుంది. ఆహారం కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు.
* నూనెలో వేయించిన ( ఫ్రై చేసిన) ఆహార పదార్ధాలను తక్కువ తినాలి.
* రోజూవారీ డైట్‌లో పండ్లు, కూరగాయల్ని అధికంగా తీసుకోవాలి.
* ఆహారంలో మార్పులు ఉండకూడదు.
* సమతుల్య ఆహారం తీసుకోవాలి.
* తీసుకునే ఆహారంలో పీచు ఉండేలా తీసుకోవాలి. (గింజ ధాన్యాలు, పప్పులు, మొలకెత్తిన ధాన్యాలు)
* క్రమం తప్పని వ్యాయామం ద్వారా శరీర బరువును పరిమితులలో ఉంచాలి.
* తక్కువ పరిమాణంలో భోజనాన్ని ఎక్కువ సార్లు తినండి.
* చక్కెర, కొవ్వు పదార్దాలకు, మద్యపాన సేవనానికి దూరంగా ఉండండి.