ఆరోగ్యకరమైన ఆహారానికి చక్కనైన యాప్
హెల్తీ ఫుడ్‌కి యాప్ అనగానే మనకిష్టమైన ఆహారం ధర గురించి తెలిపే యాప్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇది పూర్తిగా భిన్నమైన మెను. మనం ఇష్టపడే తిండి ధర గురించి చెప్పదు కానీ మనం తీసుకునే ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో చెబుతుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ర
హెల్తీ ఫుడ్‌కి యాప్ అనగానే మనకిష్టమైన ఆహారం ధర గురించి తెలిపే యాప్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇది పూర్తిగా భిన్నమైన మెను. మనం ఇష్టపడే తిండి ధర గురించి చెప్పదు కానీ మనం తీసుకునే ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో చెబుతుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రెండునెలల్లో ఈ యాప్‌ని ప్రారంభించనుంది.
భారతీయ ఆహార రకాలకు సంబంధించిన భారీ డేటాబేస్ నుంచి ఈ యాప్ డేటాను గణిస్తుంది. దేశమంతటినుంచి సేకరించిన 526 ఆహార రకాల నమూనాల్లోని 150 అంశాలకు సంబంధించి పోషకాహార సమాచారాన్ని ఈ డేటాబేస్ అందిస్తుంది. తాము ఏం తింటున్నామో ఖచ్చితంగా తెలుసుకోవాలని భావించే వారికి ఇది చాలా కీలకమైనదని సంస్థ డైరెక్టర్ లోంగావ్ తెలిపారు. మన పోషకాహార విధానాలను తీర్చిదిద్దడంలో కూడా ఇది తోడ్పడుతుందన్నారు.
ఆహార రకాలకు సంబంధించిన తొలి డేటాబేస్‌ని 1937లో తొలిసారి ప్రచురించగా చివరి డేటాబేస్‌ను 1989లో ప్రచురించారు. ఇప్పుడు పాత డేటాబేస్‌ల కంటే ఎంతో విస్తృతమైన డేటాబేస్‌ని రూపొందిస్తున్నామని ఇది మరింత వివరణాత్మకంగా ఉంటుందన లోంగావ్ పేర్కొన్నారు.
ఈ డేటాబేస్‌లో తొలిసారిగా అమినో యాసిడ్, ఫ్యాటీ యాసిడ్ గురించిన వివరాలు పొందుపరుస్తున్నారు. ఇంగ్లీషుతో పాటు భారతీయ భాషలన్నింటిలో ఆహార సూచికను ఇది కలిగి ఉంటుంది. భారతీయ ఆహారంలో కాల్షియం, మెగ్నీషియం, రిబోప్లోవిన్, నియాసిన్ వంటి పోషకపదార్థాలను ఈ డేటాబేస్ విశ్లేషిస్తుంది.