Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రక్తంలోని కొవ్వు కరగాలంటే.. మష్రూమ్స్ తీసుకోవాల్సిందే

రక్తంలోని కొవ్వు కరగాలంటే.. మష్రూమ్స్ తీసుకోవాల్సిందే
, మంగళవారం, 29 సెప్టెంబరు 2015 (12:07 IST)
హైబీపీని నియంత్రించుకోవాలంటే మష్రూమ్స్ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే మష్రూమ్స్‌ రక్తంలోని కొవ్వును కరిగిస్తుందని న్యూట్రీషన్లు అంటున్నారు. మష్రూమ్స్ మన శరరీ రక్తంలో కలిసిపోయిన కొవ్వును కరిగించి, రక్తాన్ని శుద్ధీకరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇతర కూరగాయల నుంచి పొందలేని పోషకాలు మష్రూమ్స్ నుంచి లభిస్తాయి. 
 
మష్రూమ్స్‌లో "డి" విటమిన్ అధికంగా ఉంటుంది. అందుచేత మష్రూమ్స్‌ను వారానికి రెండుసార్లైనా లేదా నాలుగు సార్లైనా తీసుకోవడం మంచిది. మష్రూమ్‌లోని లెంటిసైన్ (lentysine), ఎరిటడెనిన్ (eritadenin) అనేవి రక్తంలో కలిసిపోయిన కొవ్వును కరిగేలా చేస్తాయి. అంతేగాకుండా కరిగిన కొవ్వును ఇతర భాగాలను తరలించి మన శరీరానికి ఎలాంటి హానీ కలగకుండా చేస్తుంది. 
 
ఇంకా శరీరంలోని అనవసర కొవ్వు శాతాన్ని బాగా తగ్గిస్తుంది. ఇంకా హై-బీపీ, గుండె జబ్బులకు కూడా చెక్ పెడుతుంది. వంద గ్రాముల మష్రూమ్స్‌లో పొటాషియం 447 మి.గ్రాములు, సోడియం 9 మి.గ్రాములు ఉన్నాయి. దీంతో మహిళలకు గర్భసంబంధిత రోగాలు, మోకాలి నొప్పులకు చెక్ పెట్టవచ్చు. అంతేకాదు.. రోజూ మష్రూమ్స్ సూప్ తీసుకునే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌ను నియంత్రించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu