సీజనల్ పుట్టుగొడుగులు... తింటే ఏంటి లాభం?
సీజనల్‌గా వచ్చే కూరగాయలను తింటూ వుంటే ఆరోగ్యవంతులుగా వుంటారు. వర్షా కాలం వచ్చిందంటే పల్లెల్లో పుట్టుగొడుగులు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తాయి. ఈ కాలంలో వాటిని కూరవండుకుని తినడం గ్రామీణులకు మామూలే. ప్రతి సీజన్లో ఆయా కూరలు, ఆకు తింటుంటారు. ఇది సహజం. అందుకే
సీజనల్‌గా వచ్చే కూరగాయలను తింటూ వుంటే ఆరోగ్యవంతులుగా వుంటారు. వర్షా కాలం వచ్చిందంటే పల్లెల్లో పుట్టుగొడుగులు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తాయి. ఈ కాలంలో వాటిని కూరవండుకుని తినడం గ్రామీణులకు మామూలే. ప్రతి సీజన్లో ఆయా కూరలు, ఆకు తింటుంటారు. ఇది సహజం. అందుకే పల్లెల్లో చాలామంది ఆరోగ్యంగా ఉంటారు. ఇవన్ని వారికి పకృతి ప్రసాదించిన వరమే. ఇందులో భాగమే పుట్టుగొడుగులు.
పుట్టగొడులు గురించి అమెరికా పరిశోధకులు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. అమెరికా ఆహార, ఔషధ పాలనా విబాగం పరిశోధనలు సత్ఫలితాలనే ఇచ్చాయి. అతినీలలోహిత కిరణాల కింద పంపిన పుట్టగొడుగులను ఆరబెట్టితే ఇందులో డి విటమిన్‌ను దాచుకునే దక్షత కనిపిస్తోందని చెపుతున్నారు. పైగా పుట్టుగొడుగులు తినడం వలన బోలు ఎముకల వ్యాధి నుంచి ఉపశమనం దొరుకుతుంది. హృద్రోగం, చక్కెర వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. అలాగే రొమ్ము క్యాన్సర్‌ను అడ్డుకునే శక్తి దీనికి వుందని తేలింది.