Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?
, సోమవారం, 30 సెప్టెంబరు 2019 (23:01 IST)
వర్షాకాలంలో వేడి వేడిగా ఆహారం తీసుకోవడం అందరికీ ఇష్టమే. అలాంటప్పుడు ఈవెనింగ్ స్నాక్స్‌గా మొక్కజొన్నను ఇంట్లోనే ఫ్రై చేసుకుని తీసుకోండి. బట్టబయలుగా అమ్మే ఆహార పదార్థాలను తీసుకోవద్దు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. క్లీన్‌గా ఉండే ప్రాంతంలో కూర్చుని తినండి. అలాగే కూరగాయలు పండ్లు ఏవైనా నీటిలో శుభ్రపరిచి ఆపై తీసుకోండి అని న్యూట్రీషన్లు సలహా ఇస్తున్నారు.
 
ఇంకా ఎక్కువగా ఊరగాయలు, చట్నీలు, మిరపకాయలు, పెరుగు, కూర వంటి ఆహార పదార్థాలను నివారించండి. ఉప్పు ఆహారాలు నీరు నిలుపుదల, అజీర్ణం, అధికామ్లత మరియు ఉబ్బరం వంటి వాటిని ప్రోత్సహిస్తాయి. బాగా వేయించిన ఆహారాలు, జంక్ ఫుడ్ మరియు మాంసం నివారించండి. అయితే సలాడ్లు మరియు ఆకుకూరలను నివారించండి.
 
తేలికైన మరియు సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోండి. వండిన లేదా ఆవిరి కూరగాయలు, బీరకాయ, గుమ్మడికాయ,  సలాడ్, పండ్లు, పెసర, కిచిడి, మొక్కజొన్న, శనగపిండి, వోట్మీల్‌తో తయారైన ఆహార పదార్థాలను ఎంచుకోవచ్చు. వంటలకు తేలికగా ఉండే నెయ్యి, ఆలివ్ నూనె, మొక్కజొన్న నూనె, పొద్దు తిరుగుడు నూనెలను ఉపయోగించండి. హెవీ నూనెలైనా ఆవనూనె, వెన్న, వేరుశెనగ నూనెలను వాడకండి. 
 
వర్షాకాలంలో చేదు కూరగాయలను తినటం అలవాటు చేసుకోవాలి. కాకరకాయ, వేప, మెంతులు మరియు పసుపు వంటి చేదు మూలికలు ఇన్ఫెక్షన్‌లను నిరోధిస్తాయి. వర్షాకాలంలో కనీసం ఒక వారంలో రెండుసార్లు నువ్వులు నూనెతో ఆయిల్ బాత్ చేసుకోండి. కొంతమందికి నువ్వులు నూనె కొద్దిగా వేడి చేస్తుంది. అందువల్ల వారు కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. కోపం, చికాకు, అసూయ, అహం భావోద్వేగాలకు లోనుకాకండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏంటో ఈ జీవితం అంటుంటారు... ఎందుకిలా?