పుదీనా ఆకులు. వీటిని వంటకాల్లో విరివిగా వాడుతుంటాము. ఈ పుదీనా వంటకాల రుచికి మాత్రమే కాదు, మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలను కలిగి వుంది. అవేమిటో తెలుసుకుందాము.
పుదీనా పచ్చడి తింటే జీర్ణశక్తి లేనివారికి మంచి శక్తినిస్తుంది.
నీడలో ఆరబెట్టిన పచ్చిపుదినా ఆకులు బాగా ఎండించి మెత్తగా నూరి ఆ చూర్ణానికి నీటిని కలిపి కేశాలు రాలినచోట రాస్తే తిరిగి మొలుస్తుంది.
ఎండిన పుదీనా ఆకులను దుస్తుల మధ్య పెడితే వస్త్రాల మధ్యకి పురుగులు చేరవు.
పుదీనా ఆకు కషాయంలా కాచి, దానిని గోరువెచ్చటి నీటిలో కలుపుకుని స్నానం చేస్తే చర్మ రోగాలు అదుపులోకి వస్తాయి.
పొట్ట ఉబ్బరం తగ్గేందుకు రెండు చెంచాల పుదీనా ఆకురసంలో చిన్న యాలకుల పొడి మూడు చిటికెలు కలిపి రెండుపూటలా సేవిస్తే సరిపోతుంది.
పుదీనా ఆకులను నలగ్గొట్టి గుడ్డలో చుట్టి వాసన చూస్తుంటే జలుబు తగ్గుతుంది.
నరాల బలహీనతతో బాధపడేవారు పుదీనా తైలాన్ని మర్దనం చేస్తుంటే ఫలితం వుంటుంది.