ప్రతి తెలుగు వారి ఇంటి ముందు గుమ్మడి పండును గుమ్మానికి వ్రేలాడదీయడం మనం చూస్తుంటాం. అలాగే ఈ బూడిద గుమ్మడిని ఎక్కువగా వడియాలు గాను... గుమ్మడి కూరగాను, గుమ్మడి పచ్చళ్ల రూపంలోను వాడుతుంటారు.
అయితే ఈ బూడిద గుమ్మడిలో ఎన్నో ఔషధాలు ఉన్నాయని... అవి మనిషి ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మూత్ర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం తక్కువని తెలుపుతున్నారు.
మూత్రంలో మంటను, చీము ఉన్న పరిస్థితిలోను ఫాస్ఫేట్స్ గాని, అల్యూమినియం గాని పోతూ ఉండే పరిస్థితిలోను ఇది బాగా పనిచేస్తుందంటున్నారు. కడుపులో మంట, గొంతులో మంట, కడుపు ఉబ్బరంగా ఉండటం, అతి దాహం ఉన్నప్పుడు కడుపులో ఉన్న గ్యాస్ వల్ల గుండె నొప్పి వంటి సమస్యల నుంచి బూడిద గుమ్మడి రక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు.