లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే? పాలకూర తీసుకోండి.. ఎండు ద్రాక్షను నీటిలో మరిగించి?
లివర్ వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. బీట్‌రూట్, క్యారెట్లలో లివర్‌ను శుద్ధి చేసే ఔషధ గుణాలు ఉన్నాయి. రెండింటిలోనూ ప్లాంట్ ఆధారిత ఫ్లేవనాయిడ్స్, బీటా కెరోటీన్ సమృద్
లివర్ వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. బీట్‌రూట్, క్యారెట్లలో లివర్‌ను శుద్ధి చేసే ఔషధ గుణాలు ఉన్నాయి. రెండింటిలోనూ ప్లాంట్ ఆధారిత ఫ్లేవనాయిడ్స్, బీటా కెరోటీన్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి లివర్ పనితనాన్ని మెరుగు పరుస్తాయి. అలాగే లివర్‌లోని విష పదార్థాలను బయటికి పంపించడంలో పాలకూర బాగా పనిచేస్తుంది. దాంట్లోని ఔషధ గుణాలు లివర్‌ను శుభ్రం చేస్తాయి. లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
అలాగే లివర్‌ను శుభ్రం చేయాలంటే..? ఒక కప్పు నాణ్యమైన ఎండు ద్రాక్షకు, మూడు కప్పుల నీటిని కలిపి 20 నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగించిన నీటిని 24 గంటల పాటు నిల్వ చేయాలి. ఈ డ్రింక్‌ను వారం రోజుల పాటు తాగడం వల్ల లివర్ పూర్తిగా క్లీన్ అవుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అయితే, ఈ డ్రింక్ తీసుకోవాలనుకునే వారు ముందుగా మద్యం అలవాటు ఉన్నట్లయితే, పూర్తిగా మద్యానికి దూరంగా ఉండాల్సి ఉంటుందని వారు సూచిస్తున్నారు.