Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పనిదినాలు- వారాంతాలు.. నిద్రలో వున్న వ్యత్యాసాలతో జరిగేదేంటి?

sleep
, శుక్రవారం, 11 ఆగస్టు 2023 (15:54 IST)
వారాంతాల్లో ఆలస్యంగా నిద్రపోవడం, పనిదినాల్లో త్వరగా నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరమైందని యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైంది. పనిదినాలు, వీకెండ్‌ల మధ్య నిద్ర విధానాలు మారినప్పుడు శరీరంలో అంతర్గత మార్పులు ఏర్పడే అవకాశం వుందని యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రీషిన్‌ ఓ చాప్టర్ ద్వారా తెలిపింది. 
 
వారాంతం, పనిదినాల్లో నిద్రసమయం.. మేల్కొనే సమయం మధ్య తేడాలతో ఆరోగ్యంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం వుందని పరిశోధకులు కనుగొన్నారు. అలాగే ఆహార నాణ్యత, చక్కెర-తీపి పానీయాల అధిక తీసుకోవడం, పండ్లు వంటివి తీసుకోకపోవడంతో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం వుందని తెలుస్తోంది. 
 
నిద్ర అనేది ఆరోగ్యానికి కీలకమైంది. క్రమబద్ధమైన నిద్ర విధానాలను పాటించడం చాలా అవసరం. అందుకే నిద్రకు ఉపక్రమించడం..మేల్కోవడం సరైన సమయంగా వుండాలి. అలా కాకుంటే మైక్రోబయోమ్ టాక్సిన్స్ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు.
 
నిర్దిష్ట సూక్ష్మజీవుల జాతులు మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారిస్తుంది. మైక్రోబయోమ్ అనేది తినే ఆహారం ద్వారా ప్రభావితమవుతుంది.
 
934 మందిపై జరిపిన పరిశోధనలో మైక్రోబయోమ్ నమూనాలను పరిశీలిస్తే సాధారణంగా షెడ్యూల్ ప్రకారం నిద్రించే వారితో పోలిస్తే నిద్ర సక్రమంగా లేనివారిలో గ్లూకోజ్ కొలతలను అంచనా వేశారు. ఇందులో నిద్రించే సమయంలో తేడా వున్నవారిలో ఊబకాయం లేదా మధుమేహం పెరుగుతున్నట్లు వెల్లడి అయ్యింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హెర్బల్ కాఫీ తాగండి.. హాయిగా జీవించండి..