మల్లె పువ్వుల చాయ్ తాగితే?
మల్లె పువ్వులు సువాసనతో పరిమళాన్ని వెదజల్లటమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మల్లె పరిమళం ఒత్తిడిని దూరం చేస్తుంది. ఆ వాసన పీల్చుకుంటే ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే మల్లె చాయ్ తాగితే అధిక ర
మల్లె పువ్వులు సువాసనతో పరిమళాన్ని వెదజల్లటమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మల్లె పరిమళం ఒత్తిడిని దూరం చేస్తుంది. ఆ వాసన పీల్చుకుంటే ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే మల్లె చాయ్ తాగితే అధిక రక్తపోటును తగ్గించుకోవచ్చు. రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌లను కూడా తగ్గించుకోవచ్చు.
మల్లె పువ్వు టీనీ తాగితే నిత్యయవ్వనంగా ఉండొచ్చు. వృద్ధాప్య ఛాయలను తగ్గించుకోవచ్చు. రాత్రి పూట కప్పు మల్లెపూవుతో చేసిన టీని సేవించడం ద్వారా నిద్రలేమి దూరం అవుతుంది. కలత లేని నిద్ర మీ సొంతం అవుతుంది. ఇందులో జలుబూ, జ్వరం వంటి సమస్యల్ని నివారించే యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలెక్కువ. ఇందులోని కాచెన్స్ అనే గుణాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి.
ఇక మల్లెలతో చేసే నూనెను వాడితే చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. మల్లె చర్మానికి రక్షణగా ఉంటుంది. చర్మంపై పేరుకునే రకరకాల మచ్చల్ని నివారించడంలోనూ ఈ నూనె కీలకంగా పనిచేస్తుంది.