Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సరైన నూనెను ఎంచుకోవడం ముఖ్యం, ఎందుకు? (video)

సరైన నూనెను ఎంచుకోవడం ముఖ్యం, ఎందుకు? (video)
, బుధవారం, 29 సెప్టెంబరు 2021 (13:55 IST)
నూనెలు కొవ్వుకు మూలం, కానీ వీటిలో చాలా రకాలు గుండె జబ్బుల ప్రమాదానికి దారితీస్తాయి. మార్కెట్లో అనేక రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. కానీ అవన్నీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయో లేదో తెలియదు.
 
ఆలివ్ నూనె, ఆలివ్ పండు నుండి సేకరించబడింది. ఇందులో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులతో సమృద్ధిగా ఉంటుంది. ఇది పెద్ద మొత్తంలో యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది, ఇది అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆలివ్ నూనె బలమైన రోగనిరోధక లక్షణాలను కలిగి ఉంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది, 'చెడు' కొలెస్ట్రాల్ కణాలను ఆక్సీకరణం నుండి కాపాడుతుంది. రక్త నాళాల పనితీరును మెరుగుపరుస్తుంది.
 
వయస్సు పెరిగే కొద్ది శరీరంలోని వివిధ భాగాలు క్షీణించడం సహజ పరిణామమే. ఆ పరిణామాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రకృతి సిద్ధమైన కొన్నింటి ఆధారంగా ఆ నియంత్రణను సాధించవచ్చును. మెదడు కణాల క్షీణతా వేగాన్ని తగ్గించే శక్తి ఆలివ్ నూనెలో పుష్కలంగా ఉంది. కొవ్వు, కొలెస్ట్రాల్‌ను తగ్గించుటలో సహాయపడుతుంది
 
ఈ క్షీణతా వేగాన్ని తగ్గించడం ఆలివ్‌ నూనెతో మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే మెదడు ఆరోగ్యంగా ఉండడానికి దాదాపు 60 శాతం ఆరోగ్యవంతమైన ఫ్యాట్స్ అవసరం. ఇవి ఆలివ్ నూనెలో సమృద్ధిగా ఉన్నాయి. గింజధాన్యాలు, అవకాడో, నువ్వులనూనెలోనూ ఈ ఫ్యాట్స్ ఉన్నాయి. కాకపోతే ఆలివ్ నూనెలోని ఫ్యాట్స్‌కు కణజాలాల్లోకి వెళ్లే శక్తి చాలా అధికంగా ఉంటుంది.
 
ఈ ఫ్యాట్స్‌కి మెదడు కణాల మెంబ్రేన్ దెబ్బ తినకుండా కాపాడేందుకు సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి దెబ్బతినే పరిస్థితి నుండి ఈ ఫ్యాట్స్ బాగా రక్షిస్తాయి. మెదడులోని న్యూరాన్లను దెబ్బ తీయడం ద్వారా అల్జీమర్ వ్యాధి కారకమయ్యే హానికారక ప్రోటీన్స్ నుండి ఆలివ్ నూనెలోని ఆలియోకాంథల్ అనే మూలకం కాపాడుతుందని పరిశోధనలో తెలియజేశారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లంతో అలాంటి అనారోగ్యాలన్నీ ఔట్ (Video)