మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయను తీసుకోవాలంటే?
మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయను తీసుకోవాలంటే..? కాస్త కార్బొహైడ్రేడ్లతో కూడిన ఆహారాన్ని పక్కనబెట్టాలి. ఒక కప్పు వాటర్ మెలోన్‌లో దాదాపు 12 గ్రాముల షుగర్ కంటెంట్ ఉంటుంది. అలాంటి పుచ్చకాయను తీసుకోవాలను
మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయను తీసుకోవాలంటే..? కాస్త కార్బొహైడ్రేడ్లతో కూడిన ఆహారాన్ని పక్కనబెట్టాలి. ఒక కప్పు వాటర్ మెలోన్‌లో దాదాపు 12 గ్రాముల షుగర్ కంటెంట్ ఉంటుంది. అలాంటి పుచ్చకాయను తీసుకోవాలనుకుంటే.. ఓట్ మీల్ ఒక కప్పు జతచేసి తీసుకోవడం మంచిది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. పుచ్చకాయ తీసుకోవాలనుకునే డయాబెటిస్ పేషెంట్లు భోజనం తీసుకోవడం కాస్త ఆలస్యంగా తీసుకోవచ్చు. అలా తీసుకోవాలంటే.. క్యాలరీలను, ఇతర కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారాన్ని సమతుల్యం చేసుకోవాలి.
పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. న్యూట్రీషియన్స్ కూడా ఎక్కువే. అందుకే డయాబెటిక్ పేషెంట్లు వాటర్ మెలోన్‌ను ఎక్కువగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. డాక్టర్ సలహాల ప్రకారం పుచ్చకాయ ముక్కలను డైట్‌లో చేర్చుకోవచ్చు. శరీరంలోని చక్కెర స్థాయుల్ని నియంత్రించుకోవాలంటే.. ఒక కప్పు వాటర్ మెలోన్ తీసుకునే ముందు.. ఆహారాన్ని(కార్బొహైడ్రేట్స్ గల) కాస్త తగ్గించుకోవాల్సి వుంటుంది. అంటే అన్నం, ఇడ్లీలు, దోసెలు వంటి ఇతరత్రా ఆహారాన్ని కాస్త తగ్గించాలి.
ఇంకా ఓట్ మీల్, తృణధాన్యాలతో పాటు పుచ్చకాయ తీసుకుంటే చక్కెర స్థాయుల్ని నియంత్రించుకోవచ్చు. చక్కెర స్థాయులు అధికమైతే.. కిడ్నీ సంబంధిత వ్యాధులు, హృద్రోగ సమస్యలు, గుండెపోటు వంటివి తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటర్ మెలోన్‌లో విటమిన్ ఎ, సీ పుష్కలంగా ఉన్నప్పటికీ.. మధుమేహగ్రస్తులు దీనిని పరిమితంగానే తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.