ప్రపంచంలోకెల్లా అత్యధికంగా ధూమపానం సేవించే దేశాల్లో భారతదేశం రెండో స్థానంలో ఉందని తాజాగా జరిపిన సర్వేల్లో వెల్లడైంది. అయితే మధుమేహం వ్యాధికి ధూమపానం కూడా కారణం అవుతోందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ముంబైలో ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ సంజయ్ మెహతా మాట్లాడుతూ అధికంగా పొగత్రాగడం వల్ల శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తి శాతం తగ్గు ముఖం పడుతుందని వివరించారు. దీంతో శరీరంలోని చక్కెర సమతుల్యత అస్థిరత్వానికి గురయ్యే మధుమేహం వంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉందని తెలిపారు.
ప్రస్తుతం తాజా అధ్యయనాల ప్రకారం భారత్‌లో 35 మిలియన్ల డయాబెట్స్ రోగులు ఉన్నారని... వీరిలో అత్యధికంగా ధూమపానం సేవిస్తున్న వారేనని వెల్లడించారు. ప్రపంచంలో సుమారు 1.3 బిలియన్లు ధూమపానం సేవించే వారిలో 74 మిలియన్లు భారత్‌లోనే ఉన్నారని తెలిపారు.