Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షుగర్‌ నియంత్రణ .. రెడ్‌వైన్‌తో !

మధుమేహం ఉన్నవాళ్లు ప్రతి రోజు నిద్ర‌పోయే ముందు గ్లాసు రెడ్‌ వైన్‌ సేవిస్తే వారి షుగర్‌ నిలువలు అదుపులో ఉంటాయని, కొలెస్ట్రా‌ల్‌ నియంత్రణలో ఉండడంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాకపోతే అది మద్యాన్ని సేవించే వారి జీవక్రియల

Advertiesment
red wine
, గురువారం, 14 జులై 2016 (22:21 IST)
మధుమేహం ఉన్నవాళ్లు ప్రతి రోజు నిద్ర‌పోయే ముందు గ్లాసు రెడ్‌ వైన్‌ సేవిస్తే వారి షుగర్‌ నిలువలు అదుపులో ఉంటాయని, కొలెస్ట్రా‌ల్‌ నియంత్రణలో ఉండడంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాకపోతే అది మద్యాన్ని సేవించే వారి జీవక్రియల సామర్థ్యం మీద కూడా ఆధారపడి ఉంటుందని కూడా శాస్త్ర‌వేత‌లు తెలిపారు. ఇతరులతో పోలిస్తే, మధుమేహ బాధితులే ఎక్కువగా గుండె జబ్బులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని, వీరిలో మంచి కొలెస్ట్రా‌ల్‌ (హెచ్‌డిఎల్‌) తక్కువగా ఉండడమే కారణమ‌ని తెలిపారు. 
 
మధుమేహం ఉన్నవారు రోజూ ఓ గ్లాసు రెడ్‌ వైన్‌ తీసుకుంటే వారిలో జీవక్రియ వ్యవస్థ చక్కగా ప‌నిచేయ‌డంతో పాటు మంచి కొలెస్ట్రా‌ల్‌ వృద్ధి చెంది లిపిడ్‌ ప్రొఫైల్‌ చక్కబడుతుందని, మంచి మధుమేహం ఉన్నవాళ్లు ప్రతి రోజు రాత్రి వేళ గ్లాసు రెడ్‌ వైన్‌ సేవిస్తే వారి షుగర్‌ నిలువలు అదుపులో ఉంటాయని, కొలెస్ట్రా‌ల్‌ నియంత్రణలో ఉండడంతోపాటు గుండె ఆరోగ్యంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
శ‌రీరంలోని అపోలిపోప్రొటీన్‌ ఎ1 అనే అంశం బాగా పెరిగి, గుండె ఆరోగాన్ని కాపాడుతుంది. కాకపోతే మద్యానికి సంబంధించిన జీవక్రియలు నిధానంగా జరిగే శరీరధర్మం ఉన్నవారికే రెడ్‌వైన్‌ వల్ల బాగా ప్రయోజనం ఉంటుందని, అలా కాకుండా చాలా వేగంగా జీవక్రియలు జరిగే శరీర ధర్మం ఉన్నవారికి రెడ్‌వైన్‌ వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. సహజంగా ప్రతి ఐదుగురిలో ఒకరు జీవక్రియ వేగంగా జరిగే వారే ఉంటారు. రెడ్‌ వైన్‌ అయినా, వైట్‌ వైన్‌ అయినా ఇవేవీ రక్తపోటు మీద మాత్రం ప్రభావం చూపవు. కాకపోతే ఈ రెండు వైన్‌లలో ఏదో ఒకటి చాలా పరిమితంగా తీసుకుంటే మంచి నిద్ర రావడానికి తోడ్పడతాయని చెబుతున్నారు పరిశోధకులు. కాకపోతే ఏది తీసుకున్నా ఆ పరిమితిని మాత్రం కచ్చితంగా పాటించవలసిందే అని అంటున్నారు. ఆహారం విషయంలోనూ శరీర వ్యాయామ విషయాల్లోనూ, అవసరమైన ఔషధాల విషయంలోనూ వీరు ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతి రోజూ ఓ బెల్లం ముక్కను తింటే ఎన్ని లాభాలో తెలుసా?