ఫ్రూట్ మిక్సర్ తాగుతున్నారా? కాస్త ఆగండి
ఎండాకాలం పోయినా.. చినుకులు పడుతున్నా.. చల్లగా కాకుండా విత్ అవుట్ ఐస్‌తో ఫ్రూట్ మిక్సర్ తాగుతున్నారా? కాస్త ఆగండి. ఫ్రూట్ మిక్సర్ తాగడం ద్వారా ఆరోగ్యానికి జరిగే మేలే. అన్ని రకాల పండ్లను ఈ ఫ్రూట్ మిక్సర
ఎండాకాలం పోయినా.. చినుకులు పడుతున్నా.. చల్లగా కాకుండా విత్ అవుట్ ఐస్‌తో ఫ్రూట్ మిక్సర్ తాగుతున్నారా? కాస్త ఆగండి. ఫ్రూట్ మిక్సర్ తాగడం ద్వారా ఆరోగ్యానికి జరిగే మేలే. అన్ని రకాల పండ్లను ఈ ఫ్రూట్ మిక్సర్‌లో కలుపుతారు. తద్వారా ఆరోగ్యానికి కావలసిన ధాతువులు అందుతాయి. శరీరానికి వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. టాక్సిన్లు వెలివేయబడుతాయి.
కానీ బయట షాపుల్లో అమ్మబడే ఫ్రూట్స్ మిక్సర్‌లను తాగేటప్పుడు కొన్ని విషయాలను గుర్తు చేసుకోవాలి. పండ్లను ముక్కలు చేసిన వెంటనే యాక్సిడేషన్ అనే రసాయన మార్పులు జరగడం ప్రారంభం అవుతుంది. అయితే పండ్లను కట్ చేసి జ్యూస్ వేసిన వెంటనే తాగేయాలి. అలా చేయకుంటే జ్యూస్‌లో నురుగు తేలడం ప్రారంభం అవుతుంది. జ్యూస్ పులుపెక్కుతుంది. ఫ్రిడ్జ్‌లో జ్యూస్ నిల్వ చేసే ముందు జ్యూస్‌లో గాలిపోకుండా.. గట్టిగా మూతపెట్టి పెట్టాలి.
కానీ ఫ్రూట్ మిక్సర్‌లు భద్రపరిచేటప్పుడు శీతోష్ణస్థితి సరిగ్గా లేకపోతే.. వ్యాధికారకాలు ఏర్పడతాయి. జ్యూసుల్లో రసాయన మార్పు చెందడం ద్వారా ఫుడ్ పాయిజన్ అవుతుంది. తద్వారా శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. అందుకే ఫ్రూట్ మిక్సర్ తయారు చేసేటప్పుడు శుభ్రమైన నీటిని ఉపయోగించాలి.
కానీ బయట షాపుల్లో శుభ్రమైన నీటిని ఉపయోగిస్తున్నారా? తాజా పండ్లను ఉపయోగిస్తున్నారా? అనేది గుర్తించుకోవాలి. అందుకే ఈ జ్యూసుల జోలికి వెళ్ళడం కంటే పండ్లను అలాగే తీసుకోవడం ఎంతో ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.