ఇన్‌స్టంట్ నూడుల్స్. ఇటీవలి కాలంలో ఇంట్లో వున్న పదార్థాలతో అల్పాహారం చేసుకుని తినడం తగ్గిపోతుంది. ఈ స్థానంలో ఇన్ స్టంట్ ఫుడ్ వచ్చేస్తుంది. చాలామంది ఇన్‌స్టంట్ నూడుల్స్ తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఐతే దీన్ని తినడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము.
ఇన్‌స్టంట్ నూడుల్స్ మితంగా తీసుకోవడం వల్ల ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు ఉండకపోవచ్చు. ఐతే అందులో పోషక విలువలు తక్కువ, తరచుగా తీసుకోవడం వల్ల సమస్యలు రావచ్చు. ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో మోనోసోడియం గ్లుటామేట్ అనే పదార్ధం ఉంటుంది. దీన్ని తినడం వల్ల తలనొప్పి, కండరాల బిగుతు, తిమ్మిరి, జలదరింపు వంటివి రావచ్చు.
ఇన్‌స్టంట్ నూడుల్స్ తీసుకోవడం వల్ల విటమిన్ డి స్థాయి తగ్గుతుంది. ఊబకాయం సమస్యతో పాటు గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. దీన్ని అధికంగా తినడం వల్ల అధిక రక్తపోటు సమస్య వస్తుంది.