వాళ్లు విస్కీ పేరుతో విస్కీనే తాగుతారు.. మనం విస్కీ పేరిట సారాయి తాగుతాం.. తేడా ఇదే!
విస్కీ రంగు, రుచి, వాసన వంటి ప్రధాన లక్షణాలను అదనంగా వేరే పదార్థాలను కలపడం ద్వారా తీసుకురాకూడదు అనేది ఇంకా ముఖ్యమైన నియమం. బార్లీ, మొక్కజొన్న, రై, గోధుమల్లో ఏదో ఒక ధాన్యం పిండిని పులియబెట్టి ఈ మద్యాన్ని తయారు చేయాలి. తయారైన మద్యాన్ని కనీసం మూడు సంవత్
విస్కీ రంగు, రుచి, వాసన వంటి ప్రధాన లక్షణాలను అదనంగా వేరే పదార్థాలను కలపడం ద్వారా తీసుకురాకూడదు అనేది ఇంకా ముఖ్యమైన నియమం. బార్లీ, మొక్కజొన్న, రై, గోధుమల్లో ఏదో ఒక ధాన్యం పిండిని పులియబెట్టి ఈ మద్యాన్ని తయారు చేయాలి. తయారైన మద్యాన్ని కనీసం మూడు సంవత్సరాల పాటు ఓక్చెక్క పీపాల్లో నిల్వ ఉంచాలి. విభిన్న రంగులు, రుచుల కోసం ఈ ఓక్చెక్క పీపాల రకాలను మార్చడం, నిల్వ కాలాన్ని పెంచడం వంటి చర్యలు చేపడతారు. మొత్తం మీద తృణధాన్యాలతో తయారు చేసిన విస్కీని చెక్క పీపాల్లో కొన్నేళ్లు నిల్వ ఉంచితేనే అది నిజమైన విస్కీ అవుతుందనేది ప్రపంచ దేశాల్లో పాటించే పద్ధతి. నిర్దిష్ట కాలం నిల్వ ఉంచిన తర్వాత ఆ మద్యం తగిన ‘వయసు’కు వస్తుంది. అనంతరం దాన్ని సీసాల్లో నింపి మార్కెట్లోకి పంపుతారు.
విస్కీ అంటే.. ఏదో ఒక రకమైన తృణధాన్యాలను ఇతర తృణధాన్యాలతో కలిపి లేదా కలపకుండా నానబెట్టి, పులియబెట్టి వాటి నుంచి తయారు చేసే మద్యపానీయం’ అనేది యూరప్2008లో ఇచ్చిన నిర్వచనం. అమెరికాలో, మెక్సికోలో కూడా వారి వారి సొంత నిర్వచనాలు ఉన్నాయి. కానీ.. విస్కీని తృణధాన్యాల నుంచి తయారు చేయాలని, తయారు చేసిన విస్కీని చెక్క పీపాల్లో నిర్దష్ట కాలం నిల్వ చేయాలనే కొన్ని పద్ధతులు వారందరికీ ప్రాధమిక సూత్రాలు.
ఇతర దేశాల్లో విస్కీ, బ్రాందీ, రమ్ము, ఓడ్కా, జిన్ను వంటి మద్యపానీయాల తయారీకి.. మన దేశంలో అవే పేర్లతో విక్రయించే మద్యపానీయాల తయారీకి చాలా తేడా ఉంది. అక్కడ ఒక్కో రకం మద్యం తయారీకి నిర్దిష్టమైన పద్ధతి ఉంటుంది. అందులో ఉపయోగించే పదార్థాలు వేర్వేరుగా ఉంటాయి. తయారు చేసిన మద్యాన్ని ఓక్ చెక్క పీపాల్లో కొన్నేళ్ల పాటు నిల్వ ఉంచిన తర్వాత సీసాలకు నింపి మార్కెట్‌కు పంపిస్తారు. కానీ.. మన దేశంలో అన్ని రకాల మద్యాలనూ ఒకే పద్ధతిలో తయారు చేస్తారు. అన్నిట్లోనూ ఒకటే పదార్థం ఉపయోగిస్తారు.
విస్కీ, బ్రాందీ, రమ్ము, ఓడ్కా, జిన్నుల పేర్ల ప్రకారం ఆయా రుచులు, రంగులు వచ్చేట్లు కృత్రిమ ఫ్లేవర్లు కలుపుతారు. తయారైన వెంటనే సీసాల్లో నింపి మార్కెట్‌కు తరలిస్తారు. నిజానికి మన దేశంలో చేసినట్లు విదేశాల్లో మద్యం తయారు చేసి విక్రయిస్తే.. అది పెద్ద స్కామ్ అవుతుంది. కానీ మన దేశంలో ఈ తయారీ విధానాలకు బ్యూరో ఆఫ్ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) చట్టబద్ధత కల్పిస్తోంది. ఐఎంఎఫ్ఎల్ పేరుతో అమ్ముడవుతున్న ఈ మద్యం మార్కెట్ విలువ ఇంటర్నేషనల్ వైన్ అండ్ రీసెర్చ్ సంస్థ ప్రకారం 2014లో రూ. 41,000 కోట్లు.