రోగ నిరోధక శక్తిని పెంచే పాలకూర, తోటకూర.. పైనాపిల్, స్ట్రాబెర్రీల మిశ్రమాన్ని తీసుకుంటే..?
రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే సమయానికి ఆహారం తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరంలో యాంటీబాడీలను తయారీ చేయడంలో, రోగనిరోధక వ్యవస్థ మెమరీని నిర్వహించడంలో బి సెల్స్ కీలక పాత్ర పో
రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే సమయానికి ఆహారం తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరంలో యాంటీబాడీలను తయారీ చేయడంలో, రోగనిరోధక వ్యవస్థ మెమరీని నిర్వహించడంలో బి సెల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. బి సెల్స్ లేకుంటే, శరీరానికి ఏదైనా ప్రమాదం కలిగినప్పుడు, సోకినప్పుడు దానితో ఎలా పోరాడాలి అనే విషయాన్ని రోగనిరోధక వ్యవస్థ తిరిగి మొదటినుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది.
వేకెన్సీలు సమర్థవంతంగా పనిచేయాలంటే ఇమ్యూన్ మెమరీకి అవసరమైన యాంటీబాడీలను తయారుచేసేందుకు గాను బి సెల్స్‌ని ప్రేరేపించాల్సి ఉంటుంది. అందుచేత బి సెల్స్ యాక్టివ్‌గా పనిచేయాలంటే తప్పకుండా ఫ్రూట్స్, వెజిటబుల్స్, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం మంచి ఫలితాలనిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
పాలకూర, తోటకూర వంటి ఆకుపచ్చని కూరగాయలను నిత్యం తింటుంటే లింఫ్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ప్రతి రోజూ 2 నుంచి 4 లీటర్ల నీటిని కచ్చితంగా తీసుకోవాలి. దీనివల్ల లింఫ్ గ్రంథులు తమ పనిని సక్రమంగా నిర్వర్తిస్తాయి. లింఫ్ గ్రంథులు సరిగ్గా పనిచేయకపోతే అలసట, ఒళ్ల నొప్పులు, అజీర్ణం, గ్యాస్, స్థూలకాయం వంటి సమస్యలు వస్తాయి. వీటిని రాకుండా చూడాలంటే పైనాపిల్, స్ట్రాబెర్రీలతో తయారు చేసిన మిశ్రమాన్ని నిత్యం తీసుకోవాలి. దీని వల్ల లింఫ్ గ్రంథులు తమ పని సరిగ్గా చేస్తాయి. శరీరంలో ఉన్న విష పదార్థాలు కూడా బయటకి పోతాయి.