Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చుండ్రు తగ్గాలంటే...?!

చుండ్రు తగ్గాలంటే...?!
, గురువారం, 2 సెప్టెంబరు 2021 (22:39 IST)
మన పెద్దలకు చుండ్రు అనే సమస్య తెలియదు. ఈ రోజుల్లో చుండ్రు అంటే తెలియని వారు ఉండరు. సహజంగా మన చర్మం వాతావరణాన్నుండి రక్షించుకోవడానికి ఒక రకమైన జిగురులాగా ఉండే కొన్ని పదార్థాన్ని వదులుతూ ఉంటుంది. దీనివలన చర్మం మెత్తగా ఉంచబడుతుంది.

తలలో ఈ జిగురు గాలి సరిగా తగలక పేరుగా కట్టి పెచ్చులు పెచ్చులుగా ఊడుతూ ఉంటుంది. స్నానం రోజు శరీరం వరకే చేసి తల మనది కాదన్నట్లుగా కొందరు వదిలేస్తారు. దాని వలన తల శుభ్రం కాక చుండ్రు వస్తుంది. షాంపూలు తరచుగా వాడేవారికి కూడా అందులో కెమికల్స్ చర్మం పై పొరను పాడు చేసి ఎక్కువ పొట్టు రాలేట్లు చేస్తాయి. షాంపు పెట్టిన రోజున బాగానే వుండవచ్చు కాని తరువాత రోజునుండి వాటి నష్టం బయటపడుతుంది.

చుండ్రును పోగొట్టే షాంపూ అని మనం మోసపోతున్నాము. కేవలం తల స్నానం చేయనందువల్ల వచ్చే సమస్యను పరిష్కరించుకోవటానికి ఎంత డబ్బు వృధా చేస్తున్నారు. దీనికోసం ఏ మందులు వాడవద్దు.
 
చిట్కాలు:-
1. ప్రతిరోజు చన్నీళ్ళ తల స్నానం చేయండి, వేడినీళ్ళు తలకు పోయకూడదు. నీళ్ళు మరీ చల్లగా వుంటే కొద్దిగా వేడి నీరు కలిపి (బావిలో నీటిలాగా) ఆ నీళ్ళు పోసుకోండి. 
2. వారానికి, పది రోజులకొకసారి కుంకుడు కాయ రసంతో తలంటుకోండి. చుండ్రు మరీ ఎక్కువగా వున్నప్పుడు పొడి తలకు ఆ రసం బాగా పట్టించి 5, 10 నిమిషములు అలా వుంచి అప్పుడు చన్నీటి స్నానం చేయండి. ప్రతి రోజు ఇలా కుంకుడు రసంతో ఏడు, ఎనిమిది రోజులు చేయవచ్చు (సమస్య ఎక్కువగా వున్నవారే ప్రతిరోజు కుంకుడు రసం వాడండి).
3. తల ఆరిన తరువాత కొబ్బరి నూనె రాసుకోండి. నూనె రాస్తే చుండ్రు ఎక్కువ అవుతుందనుకుంటారు. రోజు తల స్నానం చేసేవారికిఏమికాదు. చలికాలంలో చర్మం తెల్లగా పొట్టు లేస్తున్నప్పుడు మనం కొబ్బరి నూనె రాస్తే అది కరుచుకుపోయి సమస్య తగ్గినట్లే. చుండ్రుకు కూడా నూనె రాయవచ్చు. మన పెద్దలు నూనె బాగా రాసుకున్నందుకే చుండ్రు రాలేదు. 
4. తల నూనె జిడ్డుగా వుంటే ప్రతి రోజు (ఒక చెక్క లేదా కాయ) నిమ్మరసాన్ని తలకు (తలపై చర్మానికి) రాసుకొని తల స్నానం చేస్తే జిడ్డు పోతుంది. తలలో జిగురు  గ్రంధులు ఊరించే ఎక్కువ జిగురును శుభ్రం చేయడానికి నిమ్మరసం. బాగా పనికొస్తుంది.
5. వేప నూనె కొద్దిగా నిమ్మరసం కలిపి జుట్టుకు పెట్టి, రెండు మూడు గంటలు ఆగి తలస్నానం చేయాలి.
6. చుండ్రు తైలం  తయారుచేసుకోండి:
కొబ్బరి నూనె ఒక గ్లాస్ తీసుకోండి. ఒక గ్లాసు నిమ్మరసం తీసుకోండి. రెండు కలిపి ఒక పాత్రలో చిన్న మంట మీద వేడి చేయాలి. సగం మిగలాలి దానిని నిల్వ చేసుకోండి మీరు జుట్టుకు మర్దన చేస్తూ ఉండండి. మీ అలవాటు బట్టి ఆయన జుట్టుకు పెట్టినప్పుడల్లా ఇదే తైలాన్ని పెట్టండి
7. చుండ్రు తగ్గే వరకు అరటిపండు అసలు తినకండి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్లేట్ లెట్స్ పెరగాలంటే..?!