Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉప్పు పెరిగితే బీపీ వస్తుంది... మరి తగ్గితే ఏమొస్తుందో తెలుసా?

ఉప్పు పేరు చెబితే బీపీ వున్నవారికి బీపీ పెరిగిపోతుంది. నాలుకకు కాస్త ఉప్పు తగిలినా ఆ పదార్థాన్ని అలాగే వదిలేస్తారు. రక్తపోటు వున్నవారు ఆ స్థాయిలో భయపడిపోతుంటారు. ఉప్పు ఎక్కువయితే బీపీ వస్తుంది సరే.. తగ్గితే నిద్ర ముంచుకొస్తుందట. జపాన్ శాస్త్రవేత్తలు

ఉప్పు పెరిగితే బీపీ వస్తుంది... మరి తగ్గితే ఏమొస్తుందో తెలుసా?
, గురువారం, 6 జులై 2017 (14:37 IST)
ఉప్పు పేరు చెబితే బీపీ వున్నవారికి బీపీ పెరిగిపోతుంది. నాలుకకు కాస్త ఉప్పు తగిలినా ఆ పదార్థాన్ని అలాగే వదిలేస్తారు. రక్తపోటు వున్నవారు ఆ స్థాయిలో భయపడిపోతుంటారు. ఉప్పు ఎక్కువయితే బీపీ వస్తుంది సరే.. తగ్గితే నిద్ర ముంచుకొస్తుందట. జపాన్ శాస్త్రవేత్తలు ఉప్పు తక్కువగా తీసుకునేవారిపై చేసిన పరిశోధనల్లో ఈ విషయం తేలింది. 
 
ఉప్పు తక్కువగా తీసుకునేవారికి విపరీతమైన నిద్ర వస్తుందనీ, ఎంత మొత్తుకున్నా వారు నిద్రలోకి జారుకుంటారని తమ పరిశోధనల్లో వెల్లడయిందంటున్నారు. ఆహారంలో ఉప్పు శాతం ఎక్కువయితే రాత్రివేళ పలుమార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుందట. ఉప్పు తగ్గించి తినేవారిలో ఈ సమస్య వుండదట. 
 
అందువల్ల బాగా నిద్రపోవాలి అనుకుంటే ఆహారంలో కాస్త ఉప్పు తగ్గిస్తే సరిపోతుంది... నిద్ర దానంత అదే తన్నుకుని వస్తుందని చెపుతున్నారు పరిశోధకులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పురుషులకు కూడా ప్రత్యేకంగా గర్భనిరోధక మాత్రలు