Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రతిరోజూ ఉదయాన్నే లీటర్ మంచి నీళ్లు తాగితే...?

ప్రతిరోజూ ఉదయాన్నే లీటర్ మంచి నీళ్లు తాగితే...?
, మంగళవారం, 29 జనవరి 2019 (17:02 IST)
ఇప్పటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, ప్రకృతిలో చోటుచేసుకున్న మార్పులతో పాటు పలు కారణాల వలన మనలను పలు రకాలైన అనారోగ్యాలు వెంటాడుతున్నాయి. అయితే ఎటువంటి ఆరోగ్య సమస్యలైనా ఆదిలోనే హరించే దివ్యౌషధం మంచి నీళ్లే అని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రతి రోజూ ఉదయాన్నే లీటరు మంచి నీరు తాగితే పలురకాల వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
కార్యాలయాల్లో ఉద్యోగస్తులు రోజుకు 9 నుండి 10 గంటల పాటు ఒకే సీట్లో కూర్చుని పనిచేస్తుంటారు. అటువంటి వారి పొట్టలో మందం చేరి, జీర్ణశక్తి తగ్గిపోతుంది. ప్రతిరోజూ ఉదయాన్నే మంచి నీళ్లు తాగితే, ఆ నీళ్లు పొట్టను క్లీన్ చేయడమే కాకుండా జీర్ణ శక్తిని కూడా మెరుగుపరుస్తాయి. ఉదయాన్నే వ్యాయామం చేసే అలవాటు ఉన్నవాళ్లు చాలా ఎనర్జీ కోల్పోతుంటారు. 
 
అలాంటప్పుడు వాళ్లకు ఓ లీటర్ మంచి నీళ్లు శరీరానికి ప్రొటీన్స్ బాగా అందేలా చూస్తాయి. కోల్పోయిన ఎనర్జీని తిరిగి అందిస్తాయి. రక్తంలోని మలినాలను తరిమికొడతాయి. వాతావరణ కాలుష్యం కారణంగా పలువురి చర్మం నీరసంగా తయారవుతుంది. అటువంటి వారు క్రమం తప్పకుండా రోజూ లీటరు నీళ్లు తాగితే చర్మం మెరిసిపోతుంది. మితి మీరిన బరువు పెరిగిన వాళ్లు ప్రతిరోజూ పరకడుపున మంచి నీళ్లు తాగితే బరువు అతి సులభంగా తగ్గిపోతారు.
 
ముఖ్యంగా ఇటీవల అత్యధిక సంఖ్యలో పురుషులు ఎదుర్కునే సమస్య కిడ్నీలో రాళ్లు. ఈ సమస్యకు అసలైన మందు మంచి నీళ్లే అని వైద్యులు వెల్లడించారు. రోజూ మూడు లీటర్ల మంచి నీళ్లు తాగితే కిడ్నీలో రాళ్లు చేరవు. ఇంతటి మేలు చేసే మంచి నీళ్లను తాగడమం ఎవరూ మరువకండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా మీద నమ్మకం లేదా...?