భార్యాభర్తలు శారీరక సుఖానికి దూరమైతే...
భార్యాభర్తలు లేదా స్త్రీపురుషుల మధ్య జరిగే శారీరక సంబంధం (శృంగారం) అనేది తాత్కాలిక సంతోషాన్నిచ్చే చర్య కాదనీ, శాశ్వత ఆరోగ్నాన్ని అందించే సాధనమని పరిశోధకులు అంటున్నారు. యవ్వనంగా కనిపించాలన్నా, వ్యాధులత
భార్యాభర్తలు లేదా స్త్రీపురుషుల మధ్య జరిగే శారీరక సంబంధం (శృంగారం) అనేది తాత్కాలిక సంతోషాన్నిచ్చే చర్య కాదనీ, శాశ్వత ఆరోగ్నాన్ని అందించే సాధనమని పరిశోధకులు అంటున్నారు. యవ్వనంగా కనిపించాలన్నా, వ్యాధులతో పోరాడే శక్తి సమకూరాలన్నా, నొప్పులు తగ్గాలన్నా శృంగారంలో తరచుగా పాల్గొనాల్సిందేనని స్కాట్‌ల్యాండ్‌లోని రాయల్ ఎడిన్‌బర్గ్ హాస్పిటల్ పరిశోధకులు చెపుతున్నారు.
జీవిత భాగస్వామితో విభేదాలు లేదా అనారోగ్యం వల్ల లైంగిక జీవితానికి దూరమైతే లైంగికాసక్తి సన్నగిల్లడం సహజం. అరుదుగా కొందర్లో ఈ పరిస్థితి శృంగార ఆలోచనలను రెట్టింపు చేస్తాయట. శృంగార లోపం వల్ల కొందరు నీరసం, శృంగార మీద ఆసక్తి సన్నగిల్లటం కూడా జరుగుతుంది.
శృంగారలోపం వల్ల దాని మీద ఆసక్తి క్రమక్రమంగా సన్నగిల్లటం లేదా దొరకని వస్తువు మీద ఆశ పెరిగినట్టు శారీరక సుఖం కోసం వెంపర్లాడటం... ఇలా విభిన్నమైనతత్వాలు వ్యక్తుల్లో చోటుచేసుకుంటాయి. ఈ రెండూ అనారోగ్యకరమేనని వారు హెచ్చరిస్తున్నారు.
అలాగే, మంచినిద్ర పట్టడానికి సహాయపడే మత్తును కలిగించే ఆక్సిటోసిన్ మిగతా ఎండార్ఫిన్లు శృంగారంలో పాల్గొనటం వల్ల రిలీజ్ అవుతాయట. అందువల్ల కంటి నిండా నిద్ర పట్టాలంటే శారీరక కలయిక జరగాల్సిందేనని వైద్యులు సలహా ఇస్తున్నారు.