Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇలా చేస్తే జుత్తు రాలిపోదు కదా బట్టతలకి దూరంగా ఉండొచ్చు...

చాలా మందికి చిన్న వయసులోనే బట్టతల వస్తుంది. కొందరికి వాడే నీరు పడక జట్టు రాలిపోతుంది. మరికొందరికి వారసత్వపు లక్షణంగా వస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుత కాలంలో బట్టపురి అనేది ఓ సమస్యగా మారింది. అసలు జుత్తు

ఇలా చేస్తే జుత్తు రాలిపోదు కదా బట్టతలకి దూరంగా ఉండొచ్చు...
, శుక్రవారం, 12 మే 2017 (11:34 IST)
చాలా మందికి చిన్న వయసులోనే బట్టతల వస్తుంది. కొందరికి వాడే నీరు పడక జట్టు రాలిపోతుంది. మరికొందరికి వారసత్వపు లక్షణంగా వస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుత కాలంలో బట్టతల అనేది ఓ సమస్యగా మారింది. అసలు జుత్తు రాలిపోవడానికి గల కారణాలను ఓసారి పరిశీలిస్తే... 
 
జుత్తు పోషణకు అవసరమైన ప్రొటీన్‌, ఐరన్‌, క్యాల్షియం, జింక్‌, ఇతరమైన మరికొన్ని విటమిన్లు ఇవన్నీ అందుతున్నాయా? లేదా? అనే విషయాన్ని గమనించాలి. ఆ రకమైన లోపాలు ఏమైనా ఉంటే వాటిని పూరించే ప్రయత్నం వెంటనే చేయాలి. వీటితో పాటు జీవన శైలిలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో చూసుకోవాలి. 
 
ముఖ్యంగా నిద్ర సమయంలో ఎత్తైన దిండు పెట్టుకోవడం, ఎక్కువ వేడిగా ఉన్న నీటితో తలస్నానం చేయడం, 6 గంటల కన్నా తక్కువగా నిద్రించడం వంటివి మానుకోవాలి. చాలా కాలంగా మలబద్దకం కొనసాగుతూ ఉంటే ఆహారంలో పీచుపదార్థాల మోతాదు పెంచుకుని ఆ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. అలాగే, జుత్తుకు కావాల్సిన పోషకాలను అందించి.. వెంట్రుకలు రాలిపోవడం, బట్టపురి సమస్య నుంచి బయటపడవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేసవిలో సోడాలు తాగేస్తున్నారా? టీనేజీ అమ్మాయిలు కూల్‌డ్రింక్స్ తాగితే?