Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వడదెబ్బకు విరుగుడు.. ఎండు ఖర్జూరాన్ని రాత్రంతా నీటిలో నానబెట్టి?

ఎండల్లో తిరుగుతున్నారా? అయితే తీసుకునే ఆహారంలో జాగ్రత్త పాటించండి. నీరు ఎక్కువ తాగండి. నీటి శాతం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే.. గ్లాసుడు నీళ

Advertiesment
వడదెబ్బకు విరుగుడు.. ఎండు ఖర్జూరాన్ని రాత్రంతా నీటిలో నానబెట్టి?
, బుధవారం, 26 ఏప్రియల్ 2017 (11:56 IST)
ఎండల్లో తిరుగుతున్నారా? అయితే తీసుకునే ఆహారంలో జాగ్రత్త పాటించండి. నీరు ఎక్కువ తాగండి. నీటి శాతం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే.. గ్లాసుడు నీళ్ళలో ఎండు ఖర్జూరాన్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పిప్పి తీసేసి ఆ నీటిని తాగితే సరిపోతుంది.  
 
అలాగే ఆహారంలో పుదీనాను చేర్చుకోవడం ద్వారా వేసవిలో శరీరానికి మంచిది. పుదీనాను ఆహారంలో తీసుకోవడం ద్వారా మొటిమలను దూరం చేసుకోవచ్చు. గ్లాసు నీళ్లలో పుదీనా ఆకుల్ని... వేసి మరిగించాలి. ఈ నీళ్లని వడకట్టి... అందులో తేనె చేర్చి తీసుకున్నా ఫలితం ఉంటుంది. వేడి ప్రభావం తగ్గించుకోవాలంటే, తప్పనిసరిగా కనీసం రోజుకో కీరదోసకాయను తినాలి. కీరా ముక్కలు తినడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌ బారిన పడదు. అలానే కొబ్బరి నీళ్లు... చెరకురసం, బార్లీ నీటిని కూడా తీసుకోవచ్చు. ఇంకా వేసవిలో నీరసం, అలసటను దూరం చేసుకోవాలంటే.. రోజూ పుచ్చకాయ తినాలి. 
 
ఎండలో బయటకు వెళ్లి వచ్చాక నీళ్లకి బదులు నిమ్మరసం తీసుకోవాలి. ఈ రసంలో చక్కెరకు బదులు తేనె చేర్చాలి. చల్లని పాలలో...చాక్లెట్‌, స్ట్రాబెర్రీ, కమలా ఫలం వంటివి ఏదో ఒకటి చేర్చి మిక్సీ చేయాలి. ఇలా తయారైన స్మూతీలో కాస్త తేనె చేర్చి ఉదయం పూట తీసుకుంటే ఎండ ప్రభావం మన మీద పడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చర్మానికి మేలు చేసే డార్క్ చాక్లెట్: వంటల్లో ఓ చెంచా కొబ్బరినూనె వాడితే?