Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పసుపు.. వెల్లుల్లి కలిపి అరికాళ్ళకు రాస్తే..

ఇంటి పని వంట పనితో మీ చేతులు గట్టిపడిపోతున్నాయా.. మీ చేతులు మృదువుగా తయారవ్వాలంటే ఈ చిట్కాలు పాటించండి. ఇంటి పని వంట పనితో గట్టిపడే అరచేతులకి కమలా రసంలో కొద్దిగా తేనె కలిపి రాస్తే మృదువుగా తయారవుతాయి.

Advertiesment
పసుపు.. వెల్లుల్లి కలిపి అరికాళ్ళకు రాస్తే..
, శనివారం, 1 అక్టోబరు 2016 (10:37 IST)
ఇంటి పని వంట పనితో మీ చేతులు గట్టిపడిపోతున్నాయా.. మీ చేతులు మృదువుగా తయారవ్వాలంటే ఈ చిట్కాలు పాటించండి. ఇంటి పని వంట పనితో గట్టిపడే అరచేతులకి కమలా రసంలో కొద్దిగా తేనె కలిపి రాస్తే మృదువుగా తయారవుతాయి. అలాగే గట్టిపడిన చేతులకు బంగాళదుంపలు ఉడకపెట్టి ఆ గుజ్జును రాసుకుంటే మృదువుగా వుంటాయి. 
 
పసుపు, వెల్లుల్లి కలిపి నూరి అరిచేతులు, అరికాళ్ళకు రాస్తే కాళ్ళూ, చేతులు చల్లబడటం తగ్గుతుంది. కొబ్బరి, ఆలివ్, సన్‌ఫ్లవర్, బాదం, నువ్వుల నూనెలను నాలుగు టీ స్పూన్ల చొప్పున తీసుకోవాలి. వీటన్నిటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక సీసాలో భద్రపరచుకోవాలి. రోజూ ఈ నూనెను చేతులకు పట్టించి మర్దనా చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత నిమ్మచుక్కలు వేసిన నీటితో కడిగేసుకోవాలి. అంతే మీ చేతులు మృదువుగా కోమలంగా తయారవుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళ అందం వక్షోజాల్లోనే... కారణమేంటో తెలుసా?