Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బానపొట్టకు, అధిక బరువుకు కారణాలేమిటో తెలుసా?

సరియైన ఆహారపుటలవాట్లను పాటించకపోవడం, తగిన వ్యాయామం లేకపోవడం వల్ల అధికబరువు సమస్య మొదలవుతుంది. అంతేకాదు ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోలేక, ఆ తర్వాత ఆదరాబాదరాగా అమితమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల పొట్ట పెర

బానపొట్టకు, అధిక బరువుకు కారణాలేమిటో తెలుసా?
, శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (10:41 IST)
సరియైన ఆహారపుటలవాట్లను పాటించకపోవడం, తగిన వ్యాయామం లేకపోవడం వల్ల అధికబరువు సమస్య మొదలవుతుంది. అంతేకాదు ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోలేక, ఆ తర్వాత ఆదరాబాదరాగా అమితమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల పొట్ట పెరుగే అవకాశాలు చాలా ఉన్నాయి. మొత్తమ్మీద బానపొట్టతో బండబరువుతో సతమతమైపోతారు. ఈ బానపొట్టను, అధిక బరువుకు కారణాలేమిటో చూద్దాం. 
 
శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం. రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రలోకి జారుకోవడం. భోజనానికి భోజనానికి మధ్య విరామము లేకుండా ఏదో ఒకటి తినడం. మానసికంగా ఒత్తిడికి గురి అయినప్పుడు తీసుకునే ఆహారం మోతాదు ఎక్కువ అవుతుంది. ఫలితంగా లావు పెరగడం ప్రారంభమవుతుంది. 
 
అంతేకాదు కొన్ని రకాల మందులు కూడా అధిక బరువుకు కారణమవుతాయి. స్త్రీలలో గర్భసంచి తొలగింపు సర్జరీ చేయడం వల్ల ఈ స్థూలకాయం సమస్య ఎదురవుతుంది. హార్మోన్ల అసమతౌల్యం వల్ల కూడా అధికబరువు సంతరించుకుంటుంది. 
 
వదిలించుకునే మార్గాలు
ప్రతిరోజూ కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. సైక్లింగ్, వాకింగ్, స్విమ్మింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరిగి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. 
 
పండ్లు, పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, మొలకెత్తిన విత్తనాలు తీసుకుంటుండాలి. మాంసాహారం, వేపుళ్లు, బేకరి ఫుడ్స్, ఐస్‌క్రీములు, కేకులు, బిర్యాని వంటి వాటిని మానివేయాలి. భోజనానికి భోజనానికి మధ్య చిరుతిండ్లను మానివేయాలి. అధికంగా ఉప్పు, స్వీట్లను తీసుకోకూడదు. 
 
తగినంత నీటిని తాగాలి. కనీసం రోజుకు 4 లీటర్ల నీరు తాగాలి. అయితే బరువు అనేది ఏదో నెలకో రెండు నెలలకో తగ్గిపోతుందని అనుకోవడం పొరపాటు. బరువు పొట్ట తగ్గడానికి నియమిత ఆహారప్రణాళిక క్రమబద్ధమైన జీవన విధానాన్ని దీర్ఘకాలికంగా ఉండాలన్నది గుర్తుంచుకోవాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెల్‌ఫోన్‌లో అదే పనిగా మాట్లాడుతున్నారా? మొటిమలు తప్పవట బీ కేర్ ఫుల్..