సాధారణంగా చిన్న పిల్లలకు ఆరునెలలో వయసులోనే దంతాలు రావడం మొదలవుతాయి. సంవత్సరానికి మొత్తం పళ్లు వచ్చేస్తాయి. ఇలా వచ్చినవి 6 నుంచి 12 సంవత్సరాల వయసు వరకు ఉంటాయి. ఆ తర్వాత ఒక్కొక్కటీ ఊడిపోతూ.. శాశ్వత దంతాలు వస్తాయి.
అయితే, చాలా మంది తల్లిదండ్రులు ఒక్క పన్నే కదా వచ్చింది.. బ్రష్ చేయడం ఎందుకులే అనుకుంటారు. ఇలా భావించడం తప్పు అని డెంటిస్టులు చెపుతున్నారు. ఒక్క పన్ను వచ్చినా బ్రష్ చేయించడం మరచిపోవద్దని సలహా ఇస్తున్నారు. అలాగే, బ్రష్ చేయించేటప్పుడు.. చిగుళ్లు దెబ్బతినకుండా, పేస్ట్ తినకుండా, బ్రష్ నమలకుండా జాగ్రత్తపడాలని, ప్రతి 45 రోజులకోసారి బ్రష్ మార్చాలని విధిగా సూచన చేస్తున్నారు.
అలాగే, ప్రతీ ఆరు నెలలకోసారి ఖచ్చితంగా పిల్లల్ని డెంటల్ చెకప్ తీసుకెళ్లాలి. ఈ వయసులో ఉన్న పిల్లల్లో పళ్లు పుచ్చిపోవడం చూస్తుంటాం. దీనికి కారణం.. చాక్లెట్లు, స్వీట్లు. అవి తిన్నాక తప్పకుండా బ్రష్ చేయించడం మాత్రం మరవొద్దు.